AP Exit polls vs Exact polls... ఏపీలో ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే జరుగుతుందా?
దేశవ్యాప్తంగా నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పైన అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ పీక్ కు చేరుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది? ఓటమి పాలయ్యే పార్టీ ఏమిటి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏపీ ప్రజలు ఎవరిని ఆదరించారు? ఎవరిని అధికారానికి దూరంగా విసిరేశారు? అనేది ఇప్పుడు చర్చగా మారింది.
ఏపీ ప్రజల్లో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్
తుది విడత పోలింగ్ ముగిశాక ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత రానున్న ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఏపీవాసులు ఉన్న నేపథ్యంలో, అందరూ ఎగ్జిట్ పోల్స్ పైన దృష్టి సారించారు. మే 13వతేదీన ఏపీలో ఎన్నికల జరిగిన 175అసెంబ్లీ, 25లోక్‌సభ స్థానాలపైన నేడు ఎగ్జిట్ పోల్స్ ఒకటొకటిగా విడుదల కానున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ కు రెడీ అయిన జాతీయ, లోకల్ సర్వే సంస్థలు
జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. ఇండియా టీవీ, సీఎన్బీసీ, ఇండియాటుడే- మైయాక్సిస్, చాణక్య, న్యూస్ 18, సీఎన్ఎన్ ఐబీఎన్, ఏబీపీ న్యూస్ నీల్సన్, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ.. వంటి పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీ- తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు కూడా నేడు తమ అంచనాలను వెల్లడించబోతోన్నాయి.
జగన్ , చంద్రబాబుతో సహా అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే
ఈ క్రమంలో ఏపీ వాసులకు ఎగ్జిట్ పోల్స్ పైన బిపి పెరిగిపోతుంది. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి తదితరులు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే ట్రెండ్ పైన ఫోకస్ చేయనున్నారు.
ఏపీలో గెలిచేది ఎవరు?
ఏపీలో రాజకీయ పార్టీల మాట అటుంచితే, ప్రజలలో మాత్రం ఏం జరగబోతుంది అన్నది నేడే తెలుసుకోవాలి అన్న ఉత్కంఠ కనిపిస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధింస్తుందా? లేక వైసిపి గెలవబోతుందా? అన్నదానిపై ఒక స్పష్టత నేడు వస్తుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.
సీట్లపై అంచనా తప్పినా విజయంపై ఫుల్ క్లారిటీతో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్
ఎందుకంటే దాదాపు చాలావరకు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఫలితాలు కచ్చితంగా అంచనా వెయ్య లేకపోయినప్పటికీ, అధికారం దక్కించుకునే పార్టీ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ని గతంలో జరిగిన అనేక ఎన్నికల సందర్భాలలో ఇచ్చాయి. ఈ క్రమంలోని ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాట్ పోల్స్ ను ప్రతిబింబిస్తాయి అన్న భావనలో ఏపీ వాసులు ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications