ఏపీలో మరో కొత్త కార్యక్రమం.. డ్రైవర్లకు మంచి అవకాశం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేలా, ప్రభుత్వం మరియు ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ యాప్ 'ర్యాపిడో' కలిసి ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాయి. పర్యాటకులు కేవలం ఒక ప్రయాణికుడిలా కాకుండా, ఆ ప్రాంత విశిష్టతను తెలుసుకునే యాత్రికుడిలా ఫీలయ్యేలా 'డ్రైవర్ కమ్ టూరిస్ట్ గైడ్' అనే సరికొత్త కాన్సెప్ట్‌ను తీసుకువస్తున్నారు.

సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచో, విదేశాల నుంచో వచ్చే పర్యాటకులు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో దిగాక సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ, పర్యాటక శాఖ ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును మొదటగా విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.

Experience AP Tourism with Rapido Trained Auto and Cab Drivers to Explain History and Local Flavors in AP

సెలక్షన్ & ట్రైనింగ్:

ఈ ప్యాకేజీ కోసం ర్యాపిడోలో అత్యుత్తమ రేటింగ్ (5 స్టార్) కలిగిన 280 మంది డ్రైవర్లను (248 మంది ఆటో, 32 మంది క్యాబ్ డ్రైవర్లు) ఎంపిక చేశారు. వీరికి కేవలం డ్రైవింగ్‌లోనే కాకుండా ఈ క్రింది అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు:

  • భాషా నైపుణ్యం: విదేశీ పర్యాటకులతో సులువుగా సంభాషించేలా భాషిణి యాప్, గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి సాంకేతికతను ఎలా వాడాలో నేర్పిస్తున్నారు.
  • చారిత్రక పరిజ్ఞానం: అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, కొండపల్లి కోట వంటి చారిత్రక ప్రదేశాల విశిష్టతను పర్యాటకులకు వివరించేలా వారిని సిద్ధం చేస్తున్నారు.
  • మర్యాద & భద్రత: పర్యాటకులతో ఎలా ప్రవర్తించాలి, వారి భద్రతను ఎలా పర్యవేక్షించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

యాప్‌లో కొత్త ఫీచర్..

త్వరలో ర్యాపిడో యాప్‌లో 'టూరిస్ట్ గైడ్' అనే ప్రత్యేక ఐకాన్ కనిపిస్తుంది. పర్యాటకులు దీన్ని క్లిక్ చేయగానే విజయవాడ పరిసరాల్లోని దాదాపు 20 సందర్శనీయ ప్రాంతాల జాబితా వస్తుంది. పర్యాటకులు తమకు నచ్చిన చోటును ఎంచుకోగానే, శిక్షణ పొందిన డ్రైవర్‌ కమ్ గైడ్‌ అక్కడకు చేరుకుంటారు.

చూడాల్సిన ప్రాంతాలు - రుచించాల్సిన వంటలు:

ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులను కేవలం గుడులు, గోపురాలకే పరిమితం చేయకుండా..

  • ప్రాంతాలు: ఉండవల్లి గుహలు, భవానీ ఐలాండ్, సూర్యలంక, మంగినపూడి బీచ్‌లు, నాగార్జునసాగర్, పవిత్ర సంగమం వంటి ప్రదేశాలను చూపిస్తారు.
  • రుచులు: విజయవాడ స్పెషల్ సున్నుండలు, బందరు హల్వా, రొయ్యల ఇగురు, వంకాయ పకోడి వంటి నోరూరించే స్థానిక వంటకాలను పర్యాటకులకు పరిచయం చేస్తారు.

విజయవాడలో ఈ ప్రయోగం విజయవంతమైతే, తదుపరి దశలో విశాఖపట్నం, తిరుపతి నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. దీనివల్ల పర్యాటకులకు భద్రతతో కూడిన సులభమైన ప్రయాణం లభించడమే కాకుండా, డ్రైవర్లకు అదనపు ఆదాయం, రాష్ట్రానికి మంచి గుర్తింపు లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+