Fake Challan Scam: వెలుగులోకి సంచలన విషయాలు-కుంభకోణం ఎలా జరిగిందంటే-సీఐడీకి అప్పగించే ఛాన్స్?

ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన నకిలీ చలాన్ల కుంభకోణం సంచలనం రేపుతోంది.ఏప్రిల్ ,2020 నుంచి జులై,2021 వరకు 15 నెలల కాలంలో సీఎఫ్ఎంస్ ద్వారా చెల్లించిన చలాన్లు,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదైన రిజిస్ట్రేషన్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. ఈ పీరియడ్‌లో మొత్తం 2కోట్ల చలాన్లు జారీ అవగా 50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి.వీటిల్లో ఏవి నకిలీ చలాన్లు,ఏవి ఒరిజినల్ అనేది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. అవసరమైతే ఈ కేసును సీఐడీకి అప్పగించే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

అసలేంటీ కుంభకోణం...

అసలేంటీ కుంభకోణం...

సీఎంఎఫ్ఎస్(CMFS)... అంటే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనెజ్‌మెంట్ సిస్టమ్. ఇందులో ఉండే సిటిజెన్ చలాన్ ఆప్షన్ ద్వారా ఆయా ప్రభుత్వ శాఖలకు ఆన్‌లైన్‌లో చలాన్లు చెల్లించవచ్చు. అనంతరం ఆ రిసిప్ట్‌ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అయితే సీఎంఎఫ్ఎస్‌లో చలానా ద్వారా చెల్లించిన మొత్తం,ఆ రిసిప్ట్‌లో ఉన్న మొత్తం ఒకటేనా అని వెరిఫై చేసే అవకాశం సబ్ రిజిస్ట్రార్లకు లేదు. రెండు చోట్ల వేర్వేరు సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తుండటం,రెండింటి మధ్య అనుసంధానం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఇదే అదనుగా కొంతమంది రిసిప్ట్‌లో ఉన్న మొత్తాన్ని ఎడిట్ చేసి భారీ మోసాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు... సీఎంఎఫ్ఎస్ సైట్‌లో ఒక వ్యక్తి రూ.2000 చలానా చెల్లించాడు అనుకుందాం. కానీ రిసిప్ట్‌లో ఆ మొత్తాన్ని రూ.20వేలు లేదా రూ.2లక్షలుగా ఎడిట్ చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అలా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో ఎగ్గొడుతున్నారు.

ఆడిటింగ్‌లో ఎందుకు బయటపలేదు?

ఆడిటింగ్‌లో ఎందుకు బయటపలేదు?

.ఏప్రిల్ ,2020 నుంచి జులై,2021 వరకు ఈ రకమైన రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 12 కీలక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.ఇప్పటివరకూ రూ.5కోట్ల మేర నకిలీ చలాన్లను గుర్తించారు.గత 15 నెలలుగా ఈ స్కామ్ జరుగుతున్నట్లు చెబుతున్నప్పటికీ... నాలుగైదేళ్లుగా ఇది జరుగుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతీ శాఖలో ఏటా ఆడిటింగ్ అనేది నిర్వహిస్తారు. అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన ఈ అవకతవకలు గతంలోనే ఎందుకు వెలుగుచూడలేదనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు 15 నెలల కాలంలో జరిగిన 50లక్షల రిజిస్ట్రేషన్లను వెరిఫై చేస్తున్నారు.

సబ్ రిజిస్ట్రార్లకు స్టేటస్ ఆప్షన్...

సబ్ రిజిస్ట్రార్లకు స్టేటస్ ఆప్షన్...


నకిలీ చలాన్ల స్కామ్‌ను ప్రభుత్వం గుర్తించడంతో ఇటీవలే సబ్ రిజిస్ట్రార్లకు చలాన్ రిసిప్ట్‌ను వెరిఫై చేసే 'స్టేటస్' ఆప్షన్‌ను ఇచ్చింది.దీని ద్వారా సీఎఫ్ఎంఎస్ సైట్‌లో చెల్లించిన మొత్తం,రిసిప్ట్‌లో ఉన్న మొత్తం ఒకటేనా కాదా అనేది వెరిఫై చేయవచ్చు. తద్వారా నకిలీ చలాన్లకు చెక్ పెట్టవచ్చు. అయితే ఈ స్టేటస్ ఆప్షన్‌ను ప్రభుత్వం ఇదివరకే సబ్ రిజిస్ట్రార్లకు ఇచ్చి ఉంటే ఈ స్కామ్ జరగకపోయేది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ములో ఇప్పటివరకూ ఎంత గండి పడిందనేది ప్రస్తుతం అధికారులు లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

సీఐడీకి అప్పగిస్తారా...

సీఐడీకి అప్పగిస్తారా...

చలాన్ల కుంభకోణంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు అధికారులు సీఎం‌కు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్‌లకు అనుసంధానం చేసినట్టు చెప్పారు. అనుసంధానం ద్వారా అవకతవకలకు చెక్ పెట్టవచ్చని సీఎంకు అధికారులు వివరించారు. ఇక, బోగస్ ఛలాన్లకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. అవసరమైతే ఈ కేసును సీఐడీకి అప్పగించే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ల నిలిపివేత...

తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ల నిలిపివేత...

నకిలీ చలాన్లపై ప్రస్తుతం దర్యాప్తు జరుపుతుండటంతో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు,డాక్యుమెంట్ రైటర్లు,ఇతర సిబ్బంది ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్ పరిధిలో 8 డాక్యుమెంట్స్‌లో నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.డాక్యుమెంట్ల ప్రకారం రూ.2,15,000 చెల్లించాల్సి ఉండగా.. సీఎఫ్‌ఎంఎస్‌లో 15 వేలు చలానా తీసి.. ప్రింట్ అవుట్‌లో ఆ సంఖ్య ముందు రెండు చేర్చారు.దీంతో అది 2,15,000 అయింది. ఈ వ్యవహారంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు మోసానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.

ఆ రిజిస్ట్రేషన్లపై న్యాయ సలహా కోరుతున్న ప్రభుత్వం...

ఆ రిజిస్ట్రేషన్లపై న్యాయ సలహా కోరుతున్న ప్రభుత్వం...

ఇప్పటివరకూ గుర్తించిన నకిలీ చలాన్ల కారణంగా రూ. 5 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.1కోటి ఇప్పటికే రికవరీ చేసినట్లు చెబుతున్నారు. నకిలీ చలాన్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం న్యాయ సలహా తీసుకొంటోంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని... కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ఇప్పటికే ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు.కుంభకోణం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వారం రోజులుగా కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+