ఇద్దరికీ పెళ్లయింది: వివాహేతర సంబంధం వదులుకోలేక ఆత్మహత్య
చిత్తూరు: ఇద్దరు స్త్రీపురుషులు వైవాహికేతర సంబంధాన్ని వదులుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. వార్దిద్దరికి కూడా వేరే వ్యక్తులతో పెళ్లయింది. రెండు కుటుంబాల్లోనూ పిల్లలను ఉన్నారు. అయితే బుజ్జమ్మ, గోవిందయ్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఆ విషయం బయటకు తెలియగానే తమ బంధాన్ని వదులుకోలేక ఇద్దరు కలసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని పనసకోనలో ఆదివారం వెలుగు చూసింది. శ్రీకాళహస్తికి చెందిన బుజ్జమ్మ, రాజీవ్‌నగర్‌కు చెందిన గోవిందయ్య (43)ల పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ వివాహితులే.

బుజ్జమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు, గోవిందయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం ఇటీవల ఇరువురి ఇళ్లల్లో తెలిసింది. దీంతో తరచూ ఘర్షణలు జరుగుతూ వచ్చాయి. ఇక తమ బంధాన్ని కొనసాగించలేమని భావించిన బుజ్జమ్మ, గోవిందయ్యలు శనివారం రాజీవ్‌నగర్‌కు సమీపంలోని పనసకోనకు వెళ్లి విషపుగుళికలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ విషయం ఆదివారం వెలుగుచూడటంతో మృతదేహాలను శవపరీక్షకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications