అక్రమ సంబంధం: పెళ్లైన నాలు రోజులకే ఆత్మహత్య, ప్రేయసి ఆత్మహత్యాయత్నం

వివాహమై నాలుగు రోజులు కూడా గడవకముందే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అక్రమ సంబంధం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అతను తన ప్రేయసి నివాసంలో చనిపోవడం వివాదంగా మారింది.

వివాహమై నాలుగు రోజులు కూడా గడవకముందే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అక్రమ సంబంధం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అతను తన ప్రేయసి నివాసంలో చనిపోవడం వివాదంగా మారింది.

విశాఖపట్నం: వివాహమై నాలుగు రోజులు కూడా గడవకముందే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అక్రమ సంబంధం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అతను తన ప్రేయసి నివాసంలో చనిపోవడం వివాదంగా మారింది. దీంతో ప్రేయసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, నవవధువు కన్నీరుమున్నీరైంది.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - ఓ మహిళతో కొంతకాలంగా అతనికి వివాహేతర సంబంధం వుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆమెనే తమ కుమారుడిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది.

నక్కపల్లి మండలం చినతీనార్ల శివారు ఎగుదలపేట గ్రామానికి చెందిన కోశెట్టి శ్రీను కొబ్బరి బోండాల హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి విశాఖ నగరంలోని మధురవాడ ప్రాంతం పీఎంపాలేనికి చెందిన గుత్తుర్తి రమణ కుమార్తె వరలక్ష్మితో ఈ నెల 23వ తేదీ బుధవారం రాత్రి ఎగుదలపేటలో పెళ్లి జరిగింది.

Extra maritala relation: Man commits suicide in Visakha district

అయితే, ఆదివారం ఉదయం శ్రీను చినతీనార్లలో ఒక మహిళ ఇంటికి వెళ్లాడు. శ్రీను ఆమె ఇంటిలో సీలింగ్‌ ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అతని కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లారు. శ్రీనును కిందకు నక్కపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు చెప్పారు.

ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ, శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు. శ్రీను మృతిపై అనుమానాలు వున్నాయని అతని తల్లిదండ్రులు కోశెట్టి అప్పారావు, నూకమ్మ చేసిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

శ్రీను చనిపోయాడని తెలిసిన తరువాత అతనితో వివాహేతర సంబంధం వుందని భావిస్తున్న మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న శ్రీనును కిందకు దించి ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత, అతను చనిపోయాడని తెలియడంతో ఆమె భయపడి అదే ఫ్యాన్‌కు ఉరేసుకోవడానికి యత్నించింది. అదే సమయంలో అక్కడకు చేరకున్న ఎస్‌ఐ రామకృష్ణ, హెచ్‌సీ రెడ్డి వెంటనే ఆమెను కిందకు దించారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+