ఇద్దరు మహిళలతో పెళ్లి, మరో ఇద్దరితో అక్రమ సంబంధం: నరికేశారు

చిత్తూరు: అతనికి వివాహమైంది. ఒక్కరితో కాదు ఇద్దరితో. అయినా అతడు మరో ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అయితే, ఈ వ్యవహారం బెడసికొట్టింది. చివరకు అతడి ప్రాణాలు తీసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నగరి మున్సిపాలిటీ చింతలపట్టెడ సమీపంలోని లింగ్‌సగుంట కట్టపై నివాసం ఉంటున్న ఆర్‌ సురేష్‌(30)ను గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా నరికి చంపాడు.

కాగా, తమిళనాడులోని తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన సురేష్‌ గత మూడేళ్లుగా నగరి లింగ్‌సగుంట కట్ట వద్ద నివాసం ఉంటున్నట్లుగా తెలిసింది.
ఇతను పందులు మేపుతూ వాటి మాంసం విక్రయించేవాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నట్లుగా చెబుతున్నారు. కాగా, గతంలో తమిళనాడులోని అరక్కోణంలో జరిగిన వేరువేరు నాలుగు హత్య కేసుల్లోనూ సురేష్‌ నిందితుడని తెలిసింది.

Extramarital affair: A man killed in chittoor

కిరాతకంగా సురేష్ హత్య

గత ఆదివారం రాత్రి మద్యం సేవించిన సురేష్‌ ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి తర్వాత సుమారు 2గంటల సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బయటకు లాగి అత్యంత కిరాతంగా సురేష్‌ను నరికి చంపారు. కేకలు విని అదే గదిలో పడుకుని ఉన్న భార్య లేచి చూసేసరికే సురేష్‌ ఇంటి బయట తన ద్విచక్రవాహనం వద్ద పడిపోయి ఉన్నాడు.

భార్య, బిడ్డలు వీధిలోకి వచ్చి గట్టిగా కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వారంతా లేచి చూసేసరికి అప్పటికే సురేష్‌ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, హంతకుడు ఒకడేనని, తలకు నల్లటి ముసుగు ధరించి ఉన్నాడని మృతుని భార్య పోలీసులకు తెలిపింది. హంతకుడు తమిళనాడు వాసి అయి ఉండవచ్చని, అక్రమ సంబంధాలే సురేష్‌ హత్యకు కారణమని బంధువులు భావిస్తున్నారు.

సీఐ మల్లికార్జున గుప్తా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. సోమవారం ఉదయం చిత్తూరు నుంచి క్లూస్‌టీం, జాగిలాన్ని రప్పించారు. జాగిలం హత్య జరిగిన ఇంటి నుంచి చెన్నై-తిరుపతి జాతీయ రహదారి వరకు రోడ్డు మార్గాన వచ్చింది. మధ్యలో ముళ్ళ చెట్లలో హత్యకు ఉపయోగించిన కత్తిని జాగిలం గుర్తుపట్టడంతో, పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+