కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర సంబంధం: మహిళ దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వివాహేతర సంబంధం అనుమానంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. జక్కంపూడి వైయస్సార్‌ కాలనీలో ఓ మహిళను గొంతుకోసి హతమార్చారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న ట్రాక్టర్: ఒకరి మృతి

కృష్ణా జిల్లాలోని మొవ్వలో శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రాక్టర్, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మొవ్వ మండలానికి చెందిన కొందరు గుంటూరులో జరుగుతున్న తాతావారి సంబరాలకు ట్రాక్టర్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Extramarital affair: A woman allegedly murdered

ఈ ఘటనలో యార్లగడ్డ సుశీల(50) అనే మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన మహిళ స్వగ్రామం కృష్ణాపురం శివారు గౌడపేట‌గా గుర్తించారు.

వ్యాన్ బోల్తా: ఒకరి మృతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్ వెనక, ముందు టైర్లు ఒకేసారి పంక్చర్ కావడంతో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ ఉపేంద్ర(40) అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపేంద్ర స్వగ్రామం నల్గొండ జిల్లా తిరుమలగిరి. క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman allegedly murdered for extramarital affair in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X