10మంది అమ్మాయిల్ని.. ఫేస్‌బుక్‌తో వల: ఆమె ఫిర్యాదుతో వెలుగులోకి!

దాదాపు 10మంది అమ్మాయిల వద్ద ఇతను డబ్బు గుంజినట్లు పోలీసులు నిర్దారించారు. ఫేస్ బుక్ ద్వారానే ఈ నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.

నెల్లూరు: ఫేస్‌బుక్‌ను ఆసరాగా చేసుకుని యువతులకు వల విసురుతున్న ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతులతో పరిచయం పెంచుకుని.. అందినకాడికి డబ్బులు గుంజి.. ఆపై ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్ చేసేయడం ఇతగాడి తంతు. తాజాగా ఓ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేటుగాడి ఆటలకు బ్రేక్ పడింది.

పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి గ్రామానికి చెందిన కైతేపల్లె పెంచల వరప్రసాద్‌ అనే యువకుడు పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసి సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బెంగళూరు, హైదరాబాద్ లలో పనిచేసే ఇతను సులువుగా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు.

Facebook Cheating: Man Cheated 10 Girls with Facebook for Money

ఇందుకోసం ఫేస్‌బుక్కే సరైందిగా భావించాడు. తరుచూ అమ్మాయిల ప్రొఫైల్‌ ఐడీలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి వారితో మాటలు కలిపేవాడు. అలా కొద్దిపాటి పరిచయం ఏర్పడగానే.. తానో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌నని, నిన్ను ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెబుతాడు. అలా చనువు పెరుగుతున్న కొద్ది డబ్బు ప్రస్తావన తీసుకొస్తాడు.

హై ప్రొఫైల్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నానని డబ్బు సహాయం చేయాలని కోరుతాడు. ఇలా ఇతగాడి మాటలను నమ్మి దాదాపు 10మంది యువతులు అడిగినంత డబ్బు సమర్పించుకున్నారు. ఇటీవల రాయచోటికి చెందిన ఓ యువతిని కూడా ఇలాగే మోసం చేశాడు. ఆమె వద్ద నుంచి డబ్బు తీసుకున్న వెంటనే ఫేస్ బుక్ లో అకౌంట్ క్లోజ్ చేశాడు.

మోసపోయానని గ్రహించిన యువతి రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని ఫేస్‌బుక్‌ అకౌంటులో ఉన్న ఫోన్‌నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అతని కాల్ లిస్టును పరిశీలించగా.. మరో అమ్మాయితోనూ ఆ నంబరుతో వర ప్రసాద్‌ మాట్లాడినట్లు గుర్తించారు. తనను ప్రేమిస్తున్నానని చెప్పి రూ.70వేలు గుంజాడని ఆమె పోలీసులతో చెప్పింది.

డబ్బులు పంపించిన ఖాతా వివరాల ద్వారా పోలీసులు అతన్ని పట్టుకోగలిగారు. నిందితుడిని అరెస్టు చేసి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఫేస్ బుక్ పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+