వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ ఫైటింగ్...అమ్మాయని ఛాటింగ్ చేస్తే... అబ్బాయని తెలిసి...

ఫేస్ బుక్ ఛాటింగ్ యువకుల మధ్య గొడవలకు దారితీసి పోలీసు కేసుల దాకా వెళ్లిన వైనమిది. విజయవాడకు చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్లో అమ్మాయి అనుకొని ఓ యువకుడితో ఛాటింగ్ చేశాడు. తరువాత తనతో ఛాటింగ్ చేస్తోంది అబ్బా

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఫేస్‌బుక్ చాటింగ్ విజయవాడలో యువకుల మధ్య పరస్పద దాడులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే... విజయవాడ సింగ్‌నగర్‌లోని ఓ యువకుడు ఫేస్ బుక్ లో అమ్మాయి ప్రొఫైల్ చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. అటునుంచి ఓకే రావడంతో ఛాటింగ్ మొదలుపెట్టాడు. అలా ఛాటింగ్ కొంతకాలం సాగింది. అయితే తాను ఛాటింగ్ చేసేది అమ్మాయితో కాదని స్థానికుడైన ఒక యువకుడితో అనే విషయం స్నేహితుల ద్వారా తెలిసింది.

దీంతో ఇలా మోసం చెయ్యడాన్ని అవమానంగా భావించిన యువకుడు అమ్మాయిలా తనతో ఛాటింగ్ చేసిన యువకుడిని నిలదీశాడు. దీంతో మాటా మాట పెరగడంతో అమ్మాయిలా ఛాటింగ్ చేసిన వ్యక్తి తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. ఆ తరువాత అతడు అతని నలుగురు స్నేహితులు సింగ్ నగర్ యువకుడిని బట్టలూడదీసి మరీ చితకబాదారు. అంతటితో ఆ దృశ్యాలన్నీ సెల్ ఫోన్లో చిత్రీకరించారు.

facebook fighting in vijayawada

మోసం చేసింది కాక గుడ్డలూడదీసి కొట్టడం, పైగా సెల్ ఫోన్లో చిత్రీకరించడం చేసిన ఆ యువకుడు, అతని స్నేహితులపై తన్నులు తిన్న యువకుడు ఫోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
According to the police inspector of vijayawada, a young man has made fake Facebook account and cheated another young man. The Police on wednesday filed a case against young man and his friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X