బాబును తిట్టేందుకు బీజేపీ నకిలీ ఫేస్‌బుక్ ఖాతా, అందులో జగన్‌కు అస్త్రాలు

విజయవాడ: 'ఆంధ్రా బీజేపీ' ఫేస్‌బుక్ పేజీ కొత్తగా పుట్టుకు వచ్చింది. ఇది మిత్రపక్షం టిడిపిని, ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టేందుకే పుట్టుకు వచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. టిడిపి పైన ప్రతిపక్ష నేతలకు మించి ఈ పేజీలో ఆరోపణలు ఉన్నాయి.

చంద్రబాబు పైన విపక్షాలు దుమ్మెత్తి పోసేందుకు 'ఆంధ్రా బీజేపీ' ఫేస్‌‍బుక్ పేజీ మరిన్ని అస్త్రాలను అందిస్తోంది. ప్రత్యేక హోదా అంశం... మిత్రపక్షాలు టిడిపి - బిజెపి మధ్య పెద్ద అగాధాన్నే సృష్టించింది. హోదా ఇవ్వాల్సిందేనని టీడీపీ చెబుతుండగా, హోదా కంటే ఎక్కువ సాయమే చేశామని బీజేపీ చెబుతోంది.

ఈ క్రమంలో గడచిన రెండేళ్లలో ఏపీకి కేంద్రం చేసిన సాయంపై ఇరు పార్టీల నేతలు రెండు రకాల లెక్కలు చెబుతున్నారు. ఈ క్రమంలో మిత్రపక్షం టీడీపీపై పెను విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ ఒకరు... దానిని మరింతగా తూలనాడేందుకు ఏకంగా బీజేపీ పేరిట ఓ నకిలీ ఫేస్ బుక్ ఖాతానే తెరిచారని అంటున్నారు.

Fake facebook account on the name AP BJP

ఈ ఫేస్ బుక్ పేజీలో టిడిపిపై ఘాటు వ్యాఖ్యలతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు ఉన్నాయి. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దాకా వెళ్లింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆ నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టి నిజమే అయితే, అందుకు బాధ్యులైన వారిపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసేలా ఫిర్యాదు కూడా చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.

బీజేపీ పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలపై ప్రచారం కల్పించేందుకు బీజేపీ ఏపీ శాఖకు సంబంధించి 'బీజేపీ- ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీ' పేరిట ఓ ఫేస్ బుక్ ఖాతా ఉంది. ఈ ఖాతాలో టిడిపిపై విమర్శలు గుప్పిస్తూ సదరు ఎమ్మెల్సీ పోస్టులు అప్ లోడ్ చేసేవారు.

దీనిని గమనించిన పార్టీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయ.. విమర్శలపై అతనిని వారించారు. ఈ క్రమంలో పార్టీ ఫేస్ బుక్ ఖాతా అయితే సరిపోదని భావించిన ఎమ్మెల్సీ... 'ఆంధ్రా బిజెపి- పొలిటికల్ ఆర్గనైజేషన్' పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. ఇది సదరు నేతను చిక్కుల్లో పడేసినట్లుగా ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+