ఉద్యోగాలిప్పిస్తానని మోసం: నకిలీ పోలీస్ అరెస్ట్(పిక్చర్స్)
సీతంపేట(విశాఖ): పోలీసునంటూ పలువురుని భయపెట్టడంతోపాటు ఉద్యోగం ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసును ద్వారకా జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకాజోన్ పోలీస్ స్టేషన్‌లో ఏసిపి డిఎన్ మహేష్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
కొయ్యూరు మండలం నగరం గ్రామానికి చెందిన వెలుగుల వెంకటరమణ అలియాస్ సివేరి రాము(20) పోలీస్ కానిస్టేబుల్‌గా నకిలీ గుర్తింపు కార్డు తయారు చేయించుకున్నాడు. డిఎస్పి వంటి ఉన్నతాధికారులు తనకు తెలుసునని.. హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు.

నకిలీ పోలీస్
పోలీసునంటూ పలువురుని భయపెట్టడంతోపాటు ఉద్యోగం ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసును ద్వారకా జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నకిలీ పోలీస్
ద్వారకాజోన్ పోలీస్ స్టేషన్‌లో ఏసిపి డిఎన్ మహేష్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

నకిలీ ఐడి కార్డులు
కొయ్యూరు మండలం నగరం గ్రామానికి చెందిన వెలుగుల వెంకటరమణ అలియాస్ సివేరి రాము(20) పోలీస్ కానిస్టేబుల్‌గా నకిలీ గుర్తింపు కార్డు తయారు చేయించుకున్నాడు.

నకిలీ పోలీస్
డిఎస్పి వంటి ఉన్నతాధికారులు తనకు తెలుసునని.. హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు.
గతంలో అతనిపై నర్సీపట్నం, విజయనగరంలో కేసులు ఉన్నాయి. పిఎంపాలెంలో వస్త్ర దుకాణంకు చెందిన వానపల్లి కోటేశ్వరరావుతో పరిచయం పెంచుకొని హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అతని వద్ద రూ. 6వేలు తీసుకొని పరారయ్యాడు. దీనిపై కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు జరిపిన పోలీసులు, స్థానికులు సమాచారంతో ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 6 వేలు, ట్యాబ్, సెల్‌ఫోన్, మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన ఎస్ఐ ఎస్ఎస్ రాజు, హోంగార్డులను ఏసిపి అభినందించారు.












Click it and Unblock the Notifications