జగన్ జోరు: చిరుకు పవన్, బాబుకు ఎన్టీఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: ప్రధాన రాజకీయ పార్టీల కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణ, సీమ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కో ప్రాంతంపై ఒక్కొక్కరు దృష్టి సారించారు.

ఎన్నికలకు ముందే జగన్ ఓదార్పు యాత్ర పేరిట రాష్ట్రంలో ఒకసారి విస్తృతంగా ప్రచారం సాగించారు. ఇప్పుడు ఆయన కోస్తాపై దృష్టి సారించగా, విజయమ్మ రాయలసీమ జిల్లాల్లో ప్రచారం సాగిస్తున్నారు. సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న షర్మిల 21 తరువాత నల్గొండ జిల్లా ద్వారా ప్రధానంగా తెలంగాణ జిల్లాలపై దృష్టి సారించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ జిల్లాల్లో మొదటి నుండి పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. తెలంగాణ ప్రకటన వచ్చాక జగన్ పార్టీ సమైక్యాంధ్ర నినాదం చేయడంతో అప్పటికి ఉన్న కొద్దిమంది నాయకులు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మొత్తం తెలంగాణపై దృష్టి సారించడం కన్నా ఇతర ప్రాంతాల వారు ఎక్కువగా ఉన్న కొద్ది నియోజక వర్గాలపై దృష్టి సారించాలని ఆ పార్టీ భావిస్తోంది. అలాంటి నియోజక వర్గాలను ఎంపిక చేసుకుని ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు ప్రస్తుతానికి ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. బాబు కుమారుడు నారా లోకేష్ తొలుత ప్రచారం కోసం హడావుడి చేసినా ఇప్పుడు అది కనిపించడం లేదు. గత ఏడాది నుంచి ట్విట్టర్‌లో రాజకీయ ప్రకటనలు చేస్తున్న లోకేశ్, తెలంగాణపై సిడబ్ల్యుసి ప్రకటన రావడానికి ముందు జిల్లాల్లో పర్యటించారు. యువతతో సమావేశాలు నిర్వహించారు.

 నారా లోకేష్

నారా లోకేష్

అనంతరం అనంతపురం జిల్లా హిందూపురం నుంచి లోకేశ్ సైకిల్ యాత్ర నిర్వహిస్తారని పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం చంద్రబాబు జిల్లాల వారీ గర్జనలు జరుపుతున్నారు. కానీ లోకేశ్ మాత్రం తెలంగాణ ప్రకటన వచ్చాక ఎలాంటి ప్రచారం నిర్వహించలేదు.

బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్

బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్

ఏడాది క్రితం నుంచే బాలకృష్ణ హడావుడి చేశారు. కృష్ణా జిల్లాలో పర్యటించారు. కానీ తెలంగాణపై నిర్ణయం వచ్చాక ఇప్పటి వరకు బాలకృష్ణ ఒక్క రాజకీయ సమావేశంలోనూ పాల్గొనలేదు. ఎలాంటి రాజకీయ ప్రకటన చేయలేదు. హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినా బాలకృష్ణ మాత్రం ఇప్పటి వరకు తెలంగాణ అంశంపై తన అభిప్రాయం చెప్పలేదు.

బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్

బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్

గత ఎన్నికల్లో బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగానే ఉన్నారు. బాలకృష్ణ ప్రచారం చివరలో ఉండొచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి. జూనియర్, హరికృష్ణల ప్రచారం చేస్తారా అనేది సస్పెన్స్

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి విషయానికి వస్తే కెసిఆర్‌తో పాటు కుమారుడు తారక రామారావు, కూతురు కవిత, మేనల్లుడు హరీశ్ రావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు.

కెసిఆర్ కుటుంబం

కెసిఆర్ కుటుంబం

అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి ఆహ్వానించడానికి మంతనాలు జరపడంలో కెసిఆర్ కుటుంబం చురుకైన పాత్ర పోషిస్తోంది. నామినేషన్లు ముగిసిన తరువాత కెసిఆర్ ప్రచారం ప్రారంభించగానే మిగిలిన కుటుంబ సభ్యులు సైతం విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు.

చిరంజీవి కుటుంబంలో అటు ఇటు

చిరంజీవి కుటుంబంలో అటు ఇటు

చిరంజీవి కుటుంబంలో ఇద్దరు రాజకీయాల్లో ఉండగా, చెరో పార్టీలో ఉన్నారు. అన్న చిరంజీవి కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తుంటే, తమ్ముడు జనసేన పేరిట సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. నాగబాబు అన్నయ్య చిరుతోనే ఉంటానని ప్రకటించారు.

జగన్

జగన్

ప్రధాన రాజకీయ పార్టీల కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణ, సీమ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కో ప్రాంతంపై ఒక్కొక్కరు దృష్టి సారించారు.

 విజయమ్మ

విజయమ్మ

ఎన్నికలకు ముందే జగన్ ఓదార్పు యాత్ర పేరిట రాష్ట్రంలో ఒకసారి విస్తృతంగా ప్రచారం సాగించారు. ఇప్పుడు ఆయన కోస్తాపై దృష్టి సారించగా, విజయమ్మ రాయలసీమ జిల్లాల్లో ప్రచారం సాగిస్తున్నారు. సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న షర్మిల 21 తరువాత నల్గొండ జిల్లా ద్వారా ప్రధానంగా తెలంగాణ జిల్లాలపై దృష్టి సారించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

షర్మిల

షర్మిల

తెలంగాణ జిల్లాల్లో మొదటి నుండి పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. తెలంగాణ ప్రకటన వచ్చాక జగన్ పార్టీ సమైక్యాంధ్ర నినాదం చేయడంతో అప్పటికి ఉన్న కొద్దిమంది నాయకులు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మొత్తం తెలంగాణపై దృష్టి సారించడం కన్నా ఇతర ప్రాంతాల వారు ఎక్కువగా ఉన్న కొద్ది నియోజక వర్గాలపై దృష్టి సారించాలని ఆ పార్టీ భావిస్తోంది. అలాంటి నియోజక వర్గాలను ఎంపిక చేసుకుని ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+