చేయిచేసుకున్న లెక్చరర్‌కు దేహశుద్ది, ఫ్యామిలీ సూసైడ్

Family commit suicide in hyderabad
హైదరాబాద్/రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రాజమండ్రిలోని ఓ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, చేయి చేసుకున్నాడని అతనిని విద్యార్థిని తల్లిదండ్రులు చితకబాదారు. శుక్రవారం నాడు కళాశాల జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థినిపై మరో విద్యార్థిని లెక్చరర్‌కు ఫిర్యాదు చేసింది.

విషయం తెలుసుకోకుండానే సంబంధిత విద్యార్థిని పైన లెక్చరర్‌ చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఈ ఉదయం కాలేజీకి చేరుకుని లెక్చరర్‌ను చితకబాదారు. తమ కుమార్తెపై లెక్చరర్‌ చేయిచేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువతిపై లైంగిక వేధింపులు

గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం కోపల్లెలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్న నలుగురు యువకులపై ఓ యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు నెల రోజులుగా సదరు యువకులు తనను వేధిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది.

ఉద్యోగం చేసి తిరిగి వస్తున్న సమయంలో నెల రోజులుగా నలుగురు ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. అయితే గత రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు యువకులు యత్నించారు. అయితే అదే సమయంలో ఓ ఆటో డ్రైవర్‌ అక్కడకు రావడంతో యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.

తమ కోరికను తీర్చకపోతే అత్యాచారానికి పాల్పడతామని యువకులు బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురైన యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాదు, కుషాయిగూడ, నాగార్జున నగర్ కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దంపతులు, తనయుడు విషం తాగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+