నిద్రపోతున్న చిన్నారిపై కుక్క దాడి.. చెవి, తలను తినేసింది
హైదరాబాద్: నిద్రపోతున్న చిన్నారిపై కుక్క దాడిచేసి... చెవి, తల భాగాలను తినేసింది. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్‌లో ఉండే మంజుల తన ఏడాదిన్నర పాప ప్రసన్నను బజ్జోపెట్టి బయటకు వెళ్లింది.

ఇంతలో ఇంట్లోకి చొరబడ్డ ఓ కుక్క చిన్నారి చెవిని పూర్తిగా తినేసింది. ఆ తర్వాత తల భాగాన్ని కొరికింది. చిన్నారి పీక పట్టుకునేందుకు యత్నిస్తుండగా చిన్నారి ఏడుపువిని తల్లి పరుగెత్తుకు రాగా కుక్క పారిపోయింది.
చిన్నారిని చికిత్స నిమిత్తం సమీపంలోని పేస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ చేశారు. తల భాగంలో కుక్క కరవడంతో రాబిస్ వ్యాధి త్వరగా శరీరంలోకి వ్యాప్తించే అవకాశం ఉండటంతో 48 గంటలు గడిస్తేనే గానీ.... చిన్నారి ఆరోగ్య పరిస్ధితిపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు.












Click it and Unblock the Notifications