పోలీసుల ఆత్మీయ సమ్మేళనం:తుపాకీ చేతపట్టి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫ్యామిలీ విజిట్ డే వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల కుటుంబ సభ్యులు ఆదివారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఆయుధాల ప్రదర్శన, వాటి వినియోగంపై అధికారులు వారికి అవగాహన కల్పించారు.
విజిట్ డే సందర్భంగా హోంగార్డు నుంచి డిఐ, సిఐ వరకు వారి కుటుంబాలు పోలీస్‌స్టేషన్‌లో పాల్గొని ఆత్మీయ సమ్మేళనంగా అభిప్రాయాలు పంచుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిసిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబాల సహకారంతోనే పోలీసులు వృత్తి ధర్మాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు.
పోలీస్ స్టేషన్ అంటే ఆయా స్టేషన్లలో పని చేసే సిబ్బంది కుటుంబసభ్యులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండే అవకాశం లేదన్నారు. ‘పోలీసులు ఎంత బాధ్యతతో విధులు నిర్వహిస్తారు. పని ఒత్తిడి, సంఘటనలు జరిగిన సమయంలో కొన్ని రోజుల వరకు కుటుంబసభ్యులు ముఖం కూడా చూడని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తే పోలీసుల బాధ్యతలు అవగతమై కుటుంబ సభ్యులు వారికి మరింత సహకారాన్నిచ్చే అవకాశం ఉంటుంది' అని అన్నారు.
దానివల్ల పోలీసులకు మానసిక ప్రశాంతత ఏర్పడి పోలీసులు స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. సెంట్రల్ జోన్ ఓఎస్‌డి వరప్రసాదరావు, చిక్కడపల్లి ఏసిపి టి అమర్‌కాంత్ రెడ్డి, సిఐ రాజు, డిఐ బల్వంతయ్య, ఎస్ఐలు నారాయణరెడ్డి, రవికుమార్, యాదగిరి రావు, జనార్ధన్ గౌడ్, ప్రవీణ్ పాల్గొన్నారు.

విజిట్ డే వేడుకలు
హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫ్యామిలీ విజిట్ డే వేడుకల్ని నిర్వహించారు.

విజిట్ డే వేడుకలు
ఈ సందర్భంగా పోలీసుల కుటుంబ సభ్యులు ఆదివారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.

విజిట్ డే వేడుకలు
ఆయుధాల ప్రదర్శన, వాటి వినియోగంపై అధికారులు సిబ్బంది కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు.

విజిట్ డే వేడుకలు
విజిట్ డే సందర్భంగా హోంగార్డు నుంచి డిఐ, సిఐ వరకు వారి కుటుంబాలు పోలీస్‌స్టేషన్‌లో పాల్గొని ఆత్మీయ సమ్మేళనంగా అభిప్రాయాలు పంచుకున్నారు.

విజిట్ డే వేడుకలు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిసిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబాల సహకారంతోనే పోలీసులు వృత్తి ధర్మాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు.

విజిట్ డే వేడుకలు
పోలీస్ స్టేషన్ అంటే ఆయా స్టేషన్లలో పని చేసే సిబ్బంది కుటుంబసభ్యులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండే అవకాశం లేదన్నారు.

విజిట్ డే వేడుకలు
‘పని ఒత్తిడి, సంఘటనలు జరిగిన సమయంలో కొన్ని రోజుల వరకు కుటుంబసభ్యులు ముఖం కూడా చూడని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తే పోలీసుల బాధ్యతలు అవగతమై కుటుంబ సభ్యులు వారికి మరింత సహకారాన్నిచ్చే అవకాశం ఉంటుంది' అని అన్నారు.

విజిట్ డే వేడుకలు
ఇలాంటి కార్యక్రమాల ఫలితంగా పోలీసులకు మానసిక ప్రశాంతత ఏర్పడి పోలీసులు స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications