ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన జ్యోతిష్కులు..!!

ఏపీలో గెలుపు ఎవరిది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల పైన ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సమయంలోనే సర్వే సంస్థలు తమ అంచనాలతో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్దమయ్యాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సమయంలోనే జ్యోతిష్కులు ఎంట్రీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు..ఎవరికి ఎన్నికలు వస్తాయనే అంశం పైన గ్రహ స్థితి అధారంగా తమ అంచనాలను వెల్లడిస్తున్నారు.

జ్యోతిష్కుల అంచనాలు
ఏపీలో ఎన్నికల పలితాల పైన ప్రముఖ జ్యోతిష్కులు తమ అంచనాలు బయట పెడుతున్నారు. ముఖ్య నేతల జాతకాలు పరిశీలించి...గ్రహాల స్థితిగతుల ఆధారంగా గెలుపు ఓటమలు పైన ఒక అంచనాకు వస్తున్నారు. కోనసీమ సిద్దాంతులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జగన్..చంద్రబాబులో ఎవరు గెలుస్తారు...ప్రమాణ స్వీకారానికి ఏది మంచి ముహూర్తమో వివరిస్తున్నారు. తాడేపల్లి గూడెం ప్రాంతానికి చెందిన సిద్దాంత కర్త శ్రీరామకృష్ణ శర్మ ఏపీలో వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని తన అంచనాగా వెల్లడించారు.

Famous Astrologsits Predictions over Andhra Pradesh Assembly Election Results

ఏపీలో గెలుపెవరిది
టీడీపీకి 69 స్థానాల్లో విజయం దక్కుతుందనేది శ్రీరామకృష్ణ శర్మ విశ్లేషణ. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అందరూ బీఆర్ఎస్ వస్తుందని చెబితే.. తాను మాత్రం కాంగ్రెస్ వస్తుందని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీలో తాను చెప్పిందే నిజం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురంకి చెందిన మరో ప్రముఖ పంచాంగ కర్త ఉపదృష్ట నాగాదిత్య దీనికి భిన్నంగా తన అంచనాలను వెల్లడించారు. ఏపీలో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బిజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయని చెబుతున్నారు.

జోస్యం ఫలించేనా
సీఎం జగన్..చంద్రబాబు జాతకాలకు ఈనెల 9, 11తేదీలు ప్రమాణ స్వీకారానికి మంచి రోజుగా జ్యోతిష్కులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా..పార్టీల అధినేత గ్రహాల గమనం ఆధారంగా తాము చెబుతున్న ఫలితాలే వాస్తవ రూపం దాల్చుతాయని నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే కొందరు జ్యోతిష్కులు సోషల్ మీడియా వేదికగా ఏపీలో ఎవరికి అధికారం దక్కుతుందనే అంచనాలను బయట పెట్టారు. దీంతో..ఎవరి జోస్యం నిజమవుతుంది..ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలాలంటే జూన్ 4న ఫలితాలు వెల్లడయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+