చంద్రబాబు లాయర్: ఎవరీ సిద్ధార్థ్ లూథ్రా? ఏమిటి ప్రత్యేకత?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఆయన్ని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు. చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన 24 గంటల లోగా ఆయన్ను జడ్జి ముందు హాజరు పరచాల్సి ఉంటుంది. బాబు తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు.
ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది. తన టీమ్ తో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవాడలోని ఏబీసీ కోర్టులో సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్నారు. బెయిల్ పిటిషన్ పై ఆయన తన వాదన వినిపిస్తారు. దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో సిద్ధార్థ్ లూథ్రా కూడా ఒకరు. దేశంలోని టాప్-10 లాయర్లలో ఆయన ఒకరు. న్యాయవర్గాల వివరాల ప్రకారం ఒకసారి కోర్టులో హాజరయ్యేందుకు ఆయన రూ.5 లక్షలు పుచ్చుకుంటారు. రవాణా ఖర్చులు, బస, ఇతర సదుపాయాలన్నీ అదనం. కేసును బట్టి గంటకు రూ.15 లక్షలవరకు తీసుకునే న్యాయవాదుల్లో ఆయన ఒకరు.

సిద్ధార్థ్ లూథ్రా తండ్రి కె.కె. లూథ్రా కూడా న్యాయవాదిగా పనిచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, డిల్లీ యూనివర్సిటీల నుంచి సిద్ధార్థ్ లూథ్రా.. న్యాయశాస్త్రంలో పట్టాలు అందుకున్నారు. LLB 1990లో పూర్తి చేశారు. మానవ హక్కులు, రాజ్యాంగ చట్టాలు, ఇతర న్యాయ సంబంధ అంశాలపై సిద్ధార్థ్ లూథ్రా చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆయన ప్రతిపాదించిన పలు అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంతేకాదు.. ఆయన కొన్ని పుస్తకాలను కూడా రాశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల కోర్టుల్లోనూ సేవలు అందించిన అనుభవం సిద్ధార్థ్ లూథ్రాకు ఉంది.












Click it and Unblock the Notifications