Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌ది అసలు ఓటమే కాదు..తెలుగు స్టార్ హీరో సంచలన కామెంట్స్

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ,తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లను కూడా సాధించలేకపోయింది. పార్టీ దారుణ ఓటమితో వైసీపీ కీలక నాయకులు సెలైంట్ అయ్యారు. మరికొందరు నాయకులు పార్టీని వీడుతున్నారు.

దీంతో జగన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా జగన్ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ప్రజల్లో తాను చేసిన మంచి ఇంకా బ్రతికే ఉందని జగన్ నమ్ముతున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమిని ప్రజలు నమ్మడం లేదని .. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి నానా తిప్పలు పడుతున్నారని జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో ఒక్క పింఛన్ కార్యక్రమం తప్ప మరేది అమలు కావడం లేదని వైసీపీ నేతల వాదన. ఎవరెన్ని చెప్పినా జగన్ హయంలో ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ది చెందాయనేది అక్షర సత్యం.

famous telugu actor praises Jagan s rule

తాజాగా దీనిపై ఒకప్పటి టాలీవుడ్ హీరో సుమన్ కామెంట్ చేశారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ జగన్ పార్టీ ఓటమిపై రియాక్ట్ అయ్యారు. సుమన్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో చెత్తగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను జగన్ హయంలో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. డిజిటల్‌ బోర్డులు, టాయిలెట్స్‌ మెరుగుపరిచారన్నారు. పేదలకు నేరుగా ఇంటికే పెన్షన్‌ అందించారని ఇవన్నీ జగన్‌ ప్రభుత్వంలో తనకు నచ్చాయని సుమన్‌ చెప్పుకొచ్చారు. అయితే జగన్ పాలనలో కొన్ని ప్లస్‌, కొన్ని మైనస్‌ పాయింట్స్‌ ఉన్నాయన్న సుమన్‌.. తన దృష్టిలో జగన్‌‌ది అసలు ఓటమే కాదని చెప్పుకొచ్చారు.

మోదీ, పవన్‌, చంద్రబాబు ఒకవైపు , జగన్ ఒక్కడే ఒకవైపు, అయినప్పటికీ వాళ్లకు జగన్‌ చాలా టఫ్‌ ఫైట్ ఇచ్చారని, తక్కువ మార్జిన్‌తో ఓడిపోయారన్నారు. ఇక్కడ సీట్లు చూడకూడదని, వైసీపీకి వచ్చిన ఓట్లను మాత్రమే చూడాలని ఆయన పేర్కొన్నారు.జగన్‌ హయాంలో.. విద్య, వైద్యం, పెన్షన్‌ పథకాలు బాగా అమలు చేశారని, కరోనా సమయంలో జగన్‌ చాలా బాగా హాండిల్‌ చేశారని సుమన్‌ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సుమన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+