Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్యాన్సీ నెంబరంటే ఎందుకంత మోజు?: AP16 DH 9999 విలువ 6 లక్షలు

విజయవాడ: వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఆ వాహన నెంబర్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. తాము కొనుగోలు చేసిన వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం వాహనదారులు ఎంత డబ్బైనా చెల్లించడానికి ముందుకొస్తుంటారు. తాజాగా ఏపీలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం అధ్భుతమైన ధరను సొంతం చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రవాణా శాఖ నిర్వహించిన AP16 DH 9999 అనే నెంబర్‌ అత్యధిక ధర పలికింది. రవాణా శాఖ నిర్వహించిన ఈ వేలంలో పలువురు ప్రముఖులు ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ముఖ్యంగా 9999 నంబరు కాసుల వర్షం కురిపించింది.

Fancy number 9999 fetches Rs 6.03 lakh in auction

9999 నెంబర్ కోసం మొత్తం ముగ్గురు పోటీ పడ్డారు. వారిలో సూపర్ విజ్ ప్రొఫెషనల్స్ లిమిటెడ్ యజమాని గుప్తా, మరో ఇద్దరు ఈ నంబరు కోసం బిడ్లు వేశారు. అయితే ఈ బిడ్‌లో సూపర్ విజ్ గుప్తా 9999 నెంబర్ కోసం రూ. 6.03 లక్షలు చెల్లించేందుకు ముందుకు రావడంతో రవాణా శాఖ గుప్తాకే ఈ నెంబర్‌ను కేటాయించింది.

ఇప్పటికే తన వద్ద ఉన్న బెంజ్, బీఎమ్‌డబ్ల్యు వాహనాలకు గుప్తా 9999 నెంబర్‌ను కొనుగోలు చేశారు. తాజాగా బిడ్ గురించి ఆర్టీఏ అధికారులు మాట్లాడుతూ విజయవాడ నగరంలోని ఆర్టీఏ చరిత్రలో ఇదే అత్యధిక ధరని, ఇంతవరకు ఇంత మొత్తం చెల్లించి ఎవరూ ఫ్యాన్సీ నంబరును దక్కించుకోలేదని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+