బాలయ్య జోరు: మంగళగిరి నుండి పోటీ చేయాలని...
దీంతో ఆయన పోటీపై జోరుగా మరోసారి చర్చ సాగుతోంది. హిందూపురం నుండి పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే, మంగళగిరి నుండి పోటీ చేయాలని, బాలయ్యను తాము రికార్డు మెజార్టీతో గెలిపించుకుంటామని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు, బెజవాడ, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను బాలకృష్ణ బుధవారం ఉదయం లెజెండ్ సినిమా యూనిట్ సభ్యులతో కలసి దర్శించుకున్నారు.
దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో బాలకృష్ణకు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాలకృష్ణ, బోయపాటి శ్రీను, యూనిట్ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్ధ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.
నాన్నగారి ఆశయ సాధన కోసం రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తానని, అభిమానులను అలరించడం కోసం సినిమాల్లో కొనసాగుతానని బాలకృష్ణ మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆయన శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెప్పారు.
రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, ఎక్కడి నుండి పోటీ చేయాలన్న దానిపై బావ చంద్రబాబుతో మాట్లాడతానని బాలకృష్ణ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.