దిమ్మతిరిగే షాక్: పవన్ కళ్యాణ్‌పై విమర్శలా, ఇవి కనిపించడంలేదా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారనే విమర్శలపై ఆయన అభిమానులు దిమ్మతిరిగే షాకిస్తున్నారు.
Recommended Video

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారనే విమర్శలపై ఆయన అభిమానులు దిమ్మతిరిగే షాకిస్తున్నారు. పవన్‌పై విమర్శలను అభిమానులు ఎప్పుడూ జీర్ణించుకోరు.
పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే అభిమానులు మొదటి నుంచి ఘాటుగానే స్పందిస్తారు. విమర్శల వరకు ఓకే. కానీ అభిమానులు బెదిరింపులకు దిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అభిమానులు అలా ప్రవర్తించడాన్ని ఎవరూ సమర్థించరు.

పవన్ కళ్యాణ్ ఏం చేశారనే ప్రశ్నలు
అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్‌ను చంద్రబాబుకు అనుకూలురుగా భావిస్తున్న వైసిపి ఆయనపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తుంటుంది. ఇటీవల కూడా పవన్ ఏం చేశారనే ప్రశ్నలు వినిపించాయి.

అవి కనిపించడం లేదా?
కానీ పవన్ కళ్యాణ్ వల్ల నవ్యాంధ్రలో మంచి మంచి పనులు జరిగాయనే విషయాన్ని గుర్తించాలని కొందరు అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఏపీలో పవన్ కొన్ని విషయాల్లో పోరాడి సాధిస్తుంటే.. ఎవరికీ కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు.

ఇదీ పవన్ కళ్యాణ్ అంటే
ఇటీవలి కాలంలో నిస్వార్థంగా సమస్యలపై పోరాడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారా, జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన వల్ల ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు.

వీటిపై పవన్ కళ్యాణ్ పోరాటం
ఉద్ధానం కిడ్నీ సమస్యపై హార్వార్డ్ డాక్టర్ల బృందాన్ని రప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. దశాబ్దాలుగా ఉన్న సమస్యపై ఆయన స్పందన అందరి మన్ననలు అందుకున్న విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. అలాగే, రాజధాని భూసమీకరణ విషయంలో కూడా పవన్ స్పందన ఎంతోకొంత జనాలకు ఫలితం ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసమో.. స్నేహమో.. ఏదైనా పవన్ వల్ల కొన్ని ముఖ్యమైన పనులు జరుగుతున్నాయనే విషయాన్ని పక్కన పెడితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.

పదవుల కోసం ఆశపడటం లేదు
పవన్ కళ్యాణ్ పదవుల కోసం ఆశపడి సమస్యలపై పోరాడటం లేదని గుర్తు చేస్తున్నారు. పదవే కావాలనుకుంటే బిజెపితో లేదా టిడిపితో లాలూచీపడి ఎప్పుడో సంపాదించుకునే వాడని అంటున్నారు. కానీ చిత్తశుద్ధితో సమస్యలపై పోరాడి తనకు చేతనైనంత వరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏపీలో ప్రతిపక్ష నేతగా పవన్ ఉన్నారా, జగన్ ఉన్నారా అనే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

నటన గురించి..
పవన్ కళ్యాణ్‌కు నటన రాదని కొందరు విమర్శలు చేస్తున్నారని, కానీ ఆ విషయాన్ని పవర్ స్టారే స్వయంగా చెప్పారని గుర్తు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి పట్ల ఎందుకు ఇంత అభిమానం అంటే.. అది అతని వ్యక్తిత్వమని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

హైలెట్ అయ్యేందుకే విమర్శలని ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్ పేరు చెబితే హైలెట్ అవుతారనే కొందరు తమ అభిమాన నటుడిని టార్గెట్ చేస్తుంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. సినిమా వాళ్లు కూడా పవన్ కళ్యాణ్‌ను తమ సినిమాల్లో అందరికంటే ఎక్కువగా ఉపయోగించుకోవడం చూస్తూనే ఉన్నాము. అలాగే ఆయనను విమర్శిస్తే హైలెట్ కావడానికి కొందరు విమర్శలు చేస్తుంటారని అభిమానులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications