హాస్టల్లో ఉరేసుకొని ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె పేరు అంబికగా తెలుస్తోంది. బుధవారం సాయంత్రం హిమాయత్‌నగర్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్న ఆమె ఆత్మహత్య చేసుకుంది.

నగరంలో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్న ఆమె, తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడు
కృష్ణా జిల్లా పెడనలో దారుణం జరిగింది. ప్రేమ పరుతో ఓ యువకుడు బాలికను గర్భవతి చేసి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల చేసిన అప్పును తాను చెల్లిస్తానని చెప్పి ఆ బాలికను లోబర్చుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications