• search

చిత్తూరు:కన్న కూతురిపై అత్యాచారం చేస్తున్న తండ్రి, సహకరించిన తల్లి అరెస్ట్

By Suvarnaraju
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    చిత్తూరు: కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురు పైనే మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్న కీచక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కన్న తండ్రి అకృత్యం గురించి చెప్పినా సర్థుకుపోమంటూ భర్తకు పరోక్షంగా సహకరించిన బాధితురాలి తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సురేంద్ర నాయుడు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు...చంద్రగిరి మండల ఎం.కొంగరవారిపల్లెకు చెందిన ఓ జీపు డ్రైవరుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాల్లో బీకాం కంప్యూటర్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోందన్నారు. మూడేళ్లుగా ఈ విద్యార్థినిపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని సిఐ తెలిపారు. మద్యానికి బానిసైన అతను మూడేళ్ల క్రితం యువతిపై తొలిసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నారు.

    Father arrested for molesting own daughter for 3 years...Mother too

    యువతి వ్యతిరేకించడంతో ఆమెపై, ఆమె తల్లిపై దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిపారు. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబ పోషణ భారమవుతుందన్న ఉద్దేశంతో వారు ఎవరికీ చెప్పుకోలేదని తెలిపారు. దీంతో ఇతడు మూడేళ్లుగా కూతురుపై అత్యాచారం చేస్తూ వచ్చాడని సిఐ తెలిపారు. చివరకు తన తండ్రి చేసే అఘాయిత్యాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆమె తన దూరపు బంధువుకు తన దుస్థితి గురించి చెప్పడంతో ఆమె సూచనల మేరకు యువతి ధైర్యం చేసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

    యువతి ఫిర్యాదు మేరకు నిందితులను ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు బైటపడ్డాయన్నారు. నిందితుడు తన కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు అంగీకరించినట్లు సిఐ తెలిపారు. నిందితుడి నుంచి తగిన సాక్ష్యాలను సేకరించడం జరిగిందని చెప్పారు. బాధిత యువతిని మెడికల్‌ పరీక్షల అనంతరం తిరుపతిలోని ఓ హోంకు తరలించినట్లు తెలిపారు. అలాగే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు తన అత్తను సైతం హతమార్చినట్లు తెలిసిందన్నారు. ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుడి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

    English summary
    A Father was arrested on sunday evening for allegedly raping his own daughter for last 3 years in home located in kongaravaaripalli village,Chittoor district. The police also arrested the mother of victim who cooperated with husband.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more