ఆస్పత్రి నుంచి పసిగుడ్డును కిడ్నాప్ చేసింది తండ్రే
కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద మాయమైన పసిబిడ్డను పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి తన నుంచి బిడ్డను ఎత్తుకెళ్లాడని అబద్ధం చెప్పిన పసిగుడ్డు తండ్రి మహదేవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపధ్యంలోనే మహదేవ్ బిడ్డను తన సోదరికి అప్పగించి గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
మదిరెకు చెందిన మహాదేవ్ భార్య గౌరమ్మ స్థానికంగా ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంలో ఆరు రోజుల క్రితం మగబిడ్డను ప్రసవించింది. బిడ్డకు విరేచనాలు కావడంతో తండ్రి మహదేవ్ బిడ్డను తీసుకుని సోమవారం ఉదయం పట్టణంలోని భావన చిన్నపిల్లల ఆసుపత్రికి వచ్చాడు. ఆటోలోంచి మహదేవ్ బిడ్డతో సహా దిగగానే ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికి చేరుకుని అతనితో మాట కలిపాడు.

బిడ్డను తీసుకుని టోకెన్ తీసుకోవడం కష్టం కాబట్టి తాను పట్టుకుంటానని టోకెన్ తీసుకురమ్మని చెప్పడంతో మహాదేవ్ బిడ్డను గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చి ఆసుపత్రిలోకి వెళ్తూ వెనక్కి తిరిగి చూడగా బిడ్డతో సహా ఆ వ్యక్తి పారిపోతూ కనిపించాడు. గట్టిగా కేకలు వేస్తూ వెంబడించనా ఫలితం లేకుండా పోయింది. దీంతో సిబ్బందికి చెప్పాడు. వారి సూచన మేరకు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. బిడ్డ ఆచూకీ కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.
మహాదేవ అక్క కళావతి రాత్రి 8 గంటల ప్రాంతంలో పట్టణంలోని తిమ్మారెడ్డిప్రైవేట్ బస్టాండ్‌లో చంటిబిడ్డతో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా మహదేవ్ స్వయంగా బిడ్డను తనకు అప్పగించినట్లు అంగీకరించింది. తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన మహాదేవ్‌ను అరెస్టుచేసినట్లు డిఎస్‌పి శ్రీనివాసులు తెలిపారు.












Click it and Unblock the Notifications