• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కామాంథుడు అంటే వీడే:కన్నకూతురినే మూడేళ్లుగా కాటేస్తున్నాడు...

By Suvarnaraju
|

అనంతపురం:కామాంథుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడో కీచక తండ్రి...కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతురునే తన కోరికలు తీర్చుకునేందుకు కాటేస్తున్నాడు...

మదమెక్కో లేక నిజంగానే మద్యం మత్తో తెలీదు గానీ...ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడేళ్లుగా ఈ దారుణానికి ఒడి గడుతున్నాడు. వావి వరసలే కాదు మానవత్వం కూడా మరిచిన ఈ మానవ మృగం అఘాయిత్యం గురించి అతగాడి భార్య, ఆ బాలిక కన్నతల్లికి తెలిసినా నిస్సహాయంగా నిలిచిపోవడమే కాకుండా..."నాన్నేకదమ్మా భరించు" అన్నదంటే ఆమెని ఎలా అర్థం చేసుకోవాలో తెలీని పరిస్థితి...మృగ్యమైపోతున్న మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచే ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

Father rapes own daughter for 3 years

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లెకి చెందిన విద్యార్థిని తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. ఈమె తండ్రి కారు డ్రైవర్‌. మద్యం తాగే అలవాటున్న ఇతగాడి కన్ను కన్నకూతురిపైనే పడింది. రోజూ మద్యం తాగి వచ్చి కోరికలు తీర్చుకునేందుకు కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడేవాడు. తాను కోరిన ప్రకారం కూతురు చేయకపోతే విపరీతంగా హింసించేవాడు. చేతికి ఏమి దొరికితే వాటితో చితకబాదేవాడు. అలా ఒకసారి ఏకంగా ఇనుప కమ్మీతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు.

అంతేకాదు నేను చెప్పినట్లు చెయ్యకపోతే నిన్ను కూడా "మీ అవ్వను చంపినట్లు చంపేస్తాను" అనేవాడు. దీంతో భయపడిపోయిన ఆ విద్యార్థిని తండ్రి చెప్పినట్లే చేసేది...కన్నతల్లికి చెప్పుకుంటే మరి బతుకు భయమో...పరువు పోతుందనో తెలీదు కానీ...నాన్నేకదమ్మా భరించు...అని బాధితురాలైన యువతి చెప్పిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇలా మూడేళ్లుగా తండ్రి తనపై అఘాయిత్యం చేస్తూ వస్తున్నాడని...కన్న తల్లి కూడా నిస్సహాయంగా నిలిచిపోవడంతో చేసేదిలేక మౌనంగానే భరించి వస్తున్నట్లు యువతి తెలిపింది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనల గురించి వెలుగుచూస్తుండటం..ప్రభుత్వం, పోలీసు విభాగాలు బాధితులకు అండగా నిలుస్తుండటంతో తాను కూడా ధైర్యం తెచ్చుకొని తన ఆవేదన వెలుగులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. కన్నతండ్రి అత్యాచారం గురించి ఆదివారం ఈ బాధితురాలు చంద్రగిరి పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసులు ఈమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీఐ సురేంద్రనాయుడు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chittoor: The police have booked a father for allegedly raping his daughter for three years. The shocking case came to light when the girl approached the police on sunday and narrated about this worse thing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more