Father's day 2021: అలా కోరుకునే వాడే నాన్న: పుష్ప శ్రీవాణి, రోజా స్పెషల్ గ్రీటింగ్స్

అమరావతి: ఇవ్వాళ ఫాదర్స్ డే. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా తండ్రుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సారి కూడా నాన్నల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే తండ్రుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటోన్నారు. నాన్నను హీరోగా అభివర్ణిస్తోన్నారు నెటిజన్లు. పలువురు రాజకీయ నాయకులు, నటులు, సెలెబ్రిటీలు తమకు జన్మనిచ్చిన తండ్రికి శుభాకాంక్షలు చెబుతోన్నారు. తమ జీవితాలను తీర్చిదిద్దడంలో నాన్న చేసిన కృషి విస్మరించలేమంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోన్నారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూడా తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పుష్ప శ్రీవాణికి ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి నారాయణ మూర్తితో అక్కచెల్లెళ్లతో కలిసి దిగిన ఫొటోను ఆమె తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మనలో జీవాన్ని నింపి..అల్లారుముద్దుగా పెంచి..మనలోని లోపాలను సరి చేస్తూ..మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ..మనకు గమ్యం చూపేది నాన్న..అనురాగానికి రూపం నాన్న..అంటూ తన భావాలను పంచుకున్నారు.

అలాగే- భర్త పరీక్షిత్ రాజుకు కుమార్తె యశ్విత శ్రీజగతి తరఫున ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భర్త తన భార్యను మహారాణిలా చూడలేకపోవచ్చు గానీ.. ప్రతి తండ్రి తన బిడ్డను యువరాణిలాగా చూస్తాడని చెప్పారు. తాను కష్టంలో ఉన్నా కూడా పిల్లలు బాగుండాలని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాడే నాన్న అంటూ పోస్ట్ చేశారు. పరీక్షిత్ రాజు కుమార్తెను ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోలతో కూడిన ఓ చిన్న వీడియోను ఆమె తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పుష్ప శ్రీవాణి-పరీక్షిత్ రాజు దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో యశ్వితకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Fathers day 2021: AP deputy CM Pushpa Sreevani special post, check here

కాగా- చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్‌కే రోజా.. ఫాదర్స్ డే సందర్భంగా ఓ వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తండ్రితో దిగిన కొన్ని పాత ఫొటోలతో కలిపి ఈ వీడియోను రూపొందించారు. సెల్వమణి పిల్లలతో దిగిన గ్రూప్ ఫొటోలను కూడా దీనికి జత చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు తండ్రి కృష్ణకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణతో దిగిన కొన్ని ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+