కామాంధుడు: కన్నకూతురిపై లైంగిక దాడి

నెల్లూరు: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి వావివరుసలు కూడా మరిచిపోయాడు. ఒడిలో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రే కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రి వేధింపులను తట్టుకోలేక ఆ చిన్నారి పోలీసులను ఆశ్రయించింది.

నెల్లూరు జిల్లా గుడ్లూరువారిపాలెం పంచాయతి దిగువ వెంకటరెడ్డి పాలెంలో ఇది వెలుగుచూసింది. ముత్తుకురు మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన కె.వెంకటయ్య లారీ డ్రైవర్. అతని భార్య, కుమార్తె ఉన్నారు.

వెంకటయ్య తన కుమార్తెకు 13వయేటనే పెళ్లిచేసాడు. అయితే అల్లుడికి మతిస్థిమితం లేకపోవడంతో పెళ్లయిన కొద్ది రోజులకే భర్తనుంచి విడిపోయి తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. అక్కడే 9వ తరగతిలో చేరి చదువును కొనసాగిస్తోంది.

Father sexually assaults her daughter

భార్య సైతం వెంకటయ్య వేధింపులు తట్టుకోలేక చెన్నైకు వెళ్లి ఓ ఇంటిలో వంటమనిషిగా పనిచేస్తోంది. ఇటీవల చెన్నైలో ఉన్న భార్య వద్దకు వెళ్లిన వెంకటయ్య ఆమెతో సఖ్యతగా వున్నట్లుగా నటించి కుమార్తెను తన వద్దకు పంపిస్తే బాగా చూసుకుంటానని నమ్మబలికాడు.

భర్త మాటలు నమ్మిన ఆమె అమ్మమ్మ ఇంటివద్ద వున్న కుమార్తెను వెంకటయ్య వద్దకు పంపింది. కొంతకాలంగా వెంకటయ్య కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలెట్టాడు.

దీంతో అమ్మమ్మ, మనుమరాలుతో కలిసి బుధవారం వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+