కూతురిపై తండ్రి రేప్: హాస్టల్‌కు వెళ్లి ప్రతీ ఆదివారం అదే పని...

కంటిపాపనే కాటేస్తే ఆ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలి. తండ్రే తనపై అత్యాచారం చేస్తే ఆ బాలిక పరిస్థితి ఏమిటి? అటువంటి సంఘటన ఒక్కటి ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఒంగోలు: కంటిపాపనే కాటేస్తే ఆ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలి. తండ్రే తనపై అత్యాచారం చేస్తే ఆ బాలిక పరిస్థితి ఏమిటి? అటువంటి సంఘటన ఒక్కటి ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గోహరపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్మీజవాన్‌ బొమ్మినేని చిన్నశేషయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వెంకటమ్మకు కూతురుతో పాటు ఓ కుమారుడు ఉన్నారు. పిల్లలు చిన్నతనంలో ఉన్నపుడే వెంకటమ్మ మరణించింది.

ఆ తర్వత అతను లక్ష్మీకుమారి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కూతురిని లక్ష్మీకుమారి తన మాటలతో వేధిస్తూ ఉండేది. దీంతో చిన్నశేషయ్య తన కూతురును కడప జిల్లా పోరుమామిళ్ళలో చదువు కోసం హాస్టల్‌లో వదిలిపెట్టాడు.

ప్రతి ఆదివారం హాస్టల్‌కు వెళ్తూ...

ప్రతి ఆదివారం హాస్టల్‌కు వెళ్తూ...

ప్రతి ఆదివారం హాస్టల్‌కు వెళ్తున్న చిన్నశేషయ్య కూతురిని బయటకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ళకు చిన్నశేషయ్య కూతురు ఈ విషయం తన అవ్వ,కు, తాతకు చెప్పింది. దాంతో ఆమెను వాళ్లు తమ ఇంటికి తీసుకెళ్లారు.

Recommended Video

    కొన్నేళ్లకు ఇలా...

    కొన్నేళ్లకు ఇలా...

    కొన్నేళ్ల తరువాత చిన్నశేషయ్య తన కూతురును తీసుకుని వచ్చి కొమరోలులో తన రెండో భార్య పిల్లలతో ఇంట్లో ఉండసాగారు. ఆ తర్వాత కూడా అతను బుద్ధి మార్చుకోలేదు. 22 ఏళ్ల వయస్సు గల తన కూతురిపై చిన్నశేషయ్య అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. జూలై 3వ తేదీన ఆ యువతికి కడుపు నొప్పి అని చిన్నశేషయ్యకు తెలుపగా గిద్దలూరు ఆర్మీ వైద్యశాలకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించాడు.

    ఇలా బయటపడింది...

    ఇలా బయటపడింది...

    వైద్యురాలికి ఆ యువతి యాతనను అంతా వైద్యురాలికి వినిపించింది. డాక్టర్‌ వెంటనే ఆ యువతి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొమరోలు ఎస్‌ఐ జి.ప్రభాకర్‌రెడ్డి యువతి ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని తండ్రి చిన్నశేషయ్యపై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

    ఇంట్లో తనిఖీలు...

    ఇంట్లో తనిఖీలు...

    మార్కాపురం సీఐ బత్తుల శ్రీనివాసులు మంగళవారం కొమరోలులో నివాసం ఉంటున్న చిన్నశేషయ్య ఇంటిని పరిశీలించి శేషయ్య రెండో భార్య లక్ష్మీకుమారిని, పిల్లలను విచారించారు. ఆ తర్వాత బాధితురాలు వాడుతున్న పై గదిని పరిశీలించి ఆయువతి వినియోగిస్తున్న కొన్ని వస్తువులను సీఐ శ్రీనివాసులు స్వాధీనం చేసుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+