కడుపున పుట్టిన బిడ్డ పైనే అత్యాచారం: పదేళ్ల జైలు శిక్ష..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిని బలవంతపెట్టి అత్యాచారం చేస్తూ వస్తున్నాడు.
ఏలూరు: కడుపున పుట్టిన కూతురి పైనే అత్యాచారానికి తెగబడ్డ ఓ తండ్రికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిని భయపెట్టి అత్యాచారం చేస్తూ వచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నగరంలోని పాయకపురం ప్రాంతానికి చెందిన నిందితుడు డేరంగుల ఏడుకొండలు(38), అతని భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా, కూలీ పనుల కోసం కొన్నాళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా వలసెళ్లారు.

ఇదే క్రమంలో డేరంగుల ఏడుకొండలు మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను బలవంతపెట్టి అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. గతేడాది ఏప్రిల్20, 2016న తల్లికి కుమార్తె అసలు విషయం చెప్పింది. అనంతరం తల్లి సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుకొండలును అరెస్టు చేసి విచారణ జరిపారు. నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్షతో పాటు నిందితునికి జరిమానా విధించింది.












Click it and Unblock the Notifications