నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతను పురుషుడే.. కానీ కడుపులో మాత్రం స్త్రీ జననాంగాలు..

పురుషుడి కడుపులో స్త్రీ జననాంగాలు ఉండటం అరుదుగా జరిగే విషయమని డాక్టర్లు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: పుట్టుకతో వచ్చే కొన్ని జన్యుపరమైన లోపాలు ఆలస్యంగా వెలుగుచూసే ఘటనలు చాలానే చూసుంటాం. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులోను ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.

హెర్నియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఆత్మకూరులోని 100పడకల ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. దీంతో డాక్టర్లు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. పరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటపడింది. సదరు వ్యక్తి కడుపులో గర్బసంచితో పాటు, స్త్రీ జననాంగాలు ఉండటం డాక్టర్లు గుర్తించారు.

Female genitals found out in a male's stomach

అనంతరం ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించారు. ఆపరేషన్ తర్వాత సూపరింటెండెంట్‌ చెన్నయ్య, శస్త్రచికిత్స నిఫుణుడు డాక్టర్‌ గోపి మీడియాతో మాట్లాడారు. పురుషుడి కడుపులో స్త్రీ జననాంగాలు ఉండటం అరుదుగా జరిగే విషయంగా చెప్పారు. వీటిని గనుక తొలగించకపోయి ఉంటే భవిష్యత్తులో అతను క్యాన్సర్ బారిన పడేవాడని పేర్కొన్నారు.

ఆత్మకూరులో ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిలో ఇలాంటి అరుదైన కేసులకు సైతం చికిత్సను అందించే నిపుణులైన వైద్యులు ఉన్నారని తెలిపారు.

English summary
A Patient, who suffering from hernia is approached Atmakuru doctors. Interestingly doctors found out female gentials in his stomach and they removed them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X