గంగమ్మ జాతర వైభవం: కళాకారుల నృత్యాలు(పిక్చర్స్)
విశాఖపట్నం: మత్య్సకారుల ఆరాధ్య దైవం గంగమ్మ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఉన్న ఆలయంలో వేకువజాము నుంచి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 6గంటల నుంచే ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత్స్యకారులు అమ్మవారికి పెద్ద సంఖ్యలో జంతువదలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
వేటకు సిద్ధమయ్యే మత్స్యకారులకు సముద్రంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదని ఆచారంగా చేస్తున్న జాతరను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. పులివేషాలు, కాళికాదేవి, తప్పెటగుళ్ల బృందాలతో నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అనంతరం పసుపు, కుంకమ నీళ్లతో ఘటాలను తీసుకువచ్చిన వేలాది మంది మత్స్యకార కుటుంబాల మహిళలు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఘటాలతో భారీ ఊరేగింపుగా తరలివెళ్లారు.
గంగాదేవి ఆలయం నుంచి సమీప మత్స్యకార గ్రామాల మీదుగా సాగిన ఊరేగింపు తిరిగి హార్బర్‌కు చేరింది. అనంతరం అక్కడి సముద్ర తీరంలో గంగమ్మను పూజించి, ఘటాలను నిమజ్జనం చేశారు. జాతర సందర్భంగా పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాల ఆలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందారు. కాగా, మే 31 అర్ధరాత్రి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

గంగమ్మ జాతర
మత్య్సకారుల ఆరాధ్య దైవం గంగమ్మ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది.

గంగమ్మ జాతర
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఉన్న ఆలయంలో వేకువజాము నుంచి విశేష పూజలు నిర్వహించారు.

గంగమ్మ జాతర
ఉదయం 6గంటల నుంచే ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గంగమ్మ జాతర
మత్స్యకారులు అమ్మవారికి పెద్ద సంఖ్యలో జంతువదలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

గంగమ్మ జాతర
వేటకు సిద్ధమయ్యే మత్స్యకారులకు సముద్రంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదని ఆచారంగా చేస్తున్న జాతరను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు.

గంగమ్మ జాతర
పులివేషాలు, కాళికాదేవి, తప్పెటగుళ్ల బృందాలతో నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

గంగమ్మ జాతర
అనంతరం పసుపు, కుంకమ నీళ్లతో ఘటాలను తీసుకువచ్చిన వేలాది మంది మత్స్యకార కుటుంబాల మహిళలు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గంగమ్మ జాతర
మత్స్యకారులు అమ్మవారికి పెద్ద సంఖ్యలో జంతువదలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి ఘటాలతో భారీ ఊరేగింపుగా తరలివెళ్లారు.

గంగమ్మ జాతర
గంగాదేవి ఆలయం నుంచి సమీప మత్స్యకార గ్రామాల మీదుగా సాగిన ఊరేగింపు తిరిగి హార్బర్‌కు చేరింది. అనంతరం అక్కడి సముద్ర తీరంలో గంగమ్మను పూజించి, ఘటాలను నిమజ్జనం చేశారు.












Click it and Unblock the Notifications