TTD: భక్తులకు శుభవార్త, తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఒకేసారి ఉత్సవాలు

కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో, తిరుపతి, తిరుచానూరులో వైభంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ నృసింహ జ‌యంతిని పుర‌స్కరించుకుని తిరుమల‌ వసంత మండపంలో బుధవారం శ్రీ నృసింహ పూజ శాస్త్రోక్తంగా జ‌రిగింది.మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల‌ వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఇందుకోసం శ్రీవారిని నృసింహ స్వామి అలంకారంలో సింహ వాహ‌నంపై కొలువుదీర్చారు. సుద‌ర్శ‌న చ‌క్రం, నర‌సింహుని ప్ర‌తిమ‌ను ఏర్పాటుచేశారు. అభిముఖంగా శ్రీ న‌ర‌సింహ‌స్వామివారి ప్ర‌తిమ‌లను ఆశీనుల‌ను చేశారు.పూజ‌లో భాగంగా శ్రీ నృసింహ మంత్రాన్ని 108 సార్లు, శ్రీ నృసింహ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళి, శ్రీ సుద‌ర్శ‌న మంత్రాన్ని 24 సార్లు పారాయ‌ణం చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.

Festivals are being held in Tirumala Tirupati and Tiruchanur under the auspices of TTD

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుపతి సమీపంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ‌వారం వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. మే 23న ఉదయం ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి.

Festivals are being held in Tirumala Tirupati and Tiruchanur under the auspices of TTD

వైభవంగా స్నపనతిరుమంజనం

వసంతోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.

సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంంగళవాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం.

Festivals are being held in Tirumala Tirupati and Tiruchanur under the auspices of TTD

బుధవారం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీభు సమేత గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, చందనంతో అభిషేకం చేశారు.రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి టీటీడీ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+