ఎపి, తెలంగాణ మధ్య నీళ్ల నిప్పులు: ఇప్పుడు జల విద్యుత్తు చిచ్చు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగా రాష్ట్రాల మధ్య మరో వివాదం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్లు నిప్పులు రాజేసిన విషయం తెలిసిందే. తాజాగా జలవిద్యుత్తు రగడ మొదలైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి చేస్తున్న జల విద్యుత్‌లో తమకు వాటా ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపింది.

విభజన చట్టంలో నిర్దేశించిన దాని ప్రకారం తెలంగాణ నుంచి తమకు 1512 మెగావాట్ల జల విద్యుత్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని ఏపి కేంద్ర హోంశాఖకు లేఖలో తెలిపింది. ఈ ప్రాజెక్టులను కృష్ణా బోర్డు తన ఆధీనంలోకి తెచ్చుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా కోరింది. జల విద్యుత్‌లో ఆంధ్రాకు 46.11శాతం కేటాయించాలని విభజన చట్టంలో ఉందని లేఖలో గుర్తు చేశారు.

తెలంగాణకు 53.89 శాతం వాటాను కేటాయించారు. తెలంగాణలో మొత్తం జల విద్యుదుత్పాదన 3280 మెగావాట్లు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకు 1512 మెగావాట్లు రావాలని లేఖలో అభిప్రాయపడింది. తెలంగాణకు 1762 మెగావాట్ల విద్యుత్ దక్కుతుంది. తెలంగాణ, ఆంధ్రలో జల విద్యుత్ ఉత్పాదన మొత్తం 3280 మెగావాట్లు.

Fight between AP and Telangan on power

విభజన తర్వాత ఆంధ్రాకు 910 మెగావాట్ల ప్రాజెక్టు, తెలంగాణకు 2370 మెగావాట్ల ప్రాజెక్టులు వెళ్లాయి. నీటి కేటాయింపుల తరహాలోనే నీటి ఆధారంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కేటాయించాలని ఏపి వాదిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న 374 టిఎంసి నీటిలో ఆంధ్రా వాటా 264 టిఎంసి ఉంది. ఈ వాటా ప్రకారమే ఉత్పత్తి అయిన జల విద్యుత్ కావాలని ఏపి కేంద్రాన్ని కోరినట్లు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

పులిచింతల ప్రాజెక్టు సాగునీటి జలాలను ఆంధ్ర పూర్తిగా వినియోగించుకుంటోంది. అలాగే పులిచింతలపై నిర్మించిన జల విద్యుత్ మాత్రం తెలంగాణ ఆధీనంలో ఉంది. ఈ ప్రాజెక్టులో కూడా తమకు వాటా ఉందని, రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఎపి కోోరింది. పులిచింతల కుడివైపు తాముకూడా కొత్తగా జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని ఏపి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

మొత్త మీద, ఈ వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. వర్షాలు పడి జలాశయాలు నిండిన నేపథ్యంలో జలవిద్యుదుత్పాదన తగినంత మేర జరిగే అవకాశం ఉంది. దీంతో ఎపి తాజాగా ఆ వాదనను వినిపిస్తూ కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+