Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నారా రోహిత్ వర్సెస్ కళ్యాణ్ రామ్: జూ. ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య కొనసాగింపు?

హైదరాబాద్‌: బాబాయ్ నందమూరి బాలకృష్ణకు, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు ముదిరి నారా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మరింతగా పాకిన సూచనలు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ మధ్య రాజకీయ వారసత్వ పోరు ముగిసి, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వారసుడిగా నిలబడినట్లు భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం తలెత్తిన సినిమా వార్ మరో చర్చకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.

నారా, నందమూరి కుటుంబాలకు చెందిన యువ హీరోలు ఇద్దరు బాక్సాఫీస్ ముందు తలపడేందుకు సిద్ధపడుతున్నారు. పటాస్ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన కల్యాణ్ రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటించాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయి నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. కాగా, నారా రోహిత్, రెజినా జంటగా నటించిన శంకర సినిమాను అదే రోజు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో వెండి తెరపై నారా, నందమూరి హీరోల మధ్య పోటీ తప్పేట్లు లేదని అంటున్నారు.

యాదృచ్ఛికమైనా..

యాదృచ్ఛికమైనా..

నారా రోహిత్ సినిమా శంకర, కల్యాణ్ రామ్ సినిమా ఇజం ఒకే రోజు విడుదలకు సిద్ధం అవుతుండడం యాదృచ్ఛికమై కావచ్చు గానీ తీవ్రమైన చర్చకు మాత్రం ఇది దారి తీస్తోంది. రాజకీయంగా కూడా చర్చకు కారణమయ్యే అవకాశాలున్నాయి.

నారా రోహిత్‌కు చంద్రబాబు అండ..

నారా రోహిత్‌కు చంద్రబాబు అండ..

నారా రోహిత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడి కుమారుడు. నారా రోహిత్‌కు చెందిన సినిమా ఆడియో విడుదల వంటి కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యారు కూడా. తమ కుటుంబం నుంచి కూడా ఓ హీరో ఉన్నాడని ఆయన సంతోషపడిన సందర్భం కూడా ఉంది.

కల్యాణ్ రామ్‌కు జూ ఎన్టీఆర్ అండ...

కల్యాణ్ రామ్‌కు జూ ఎన్టీఆర్ అండ...

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించిన ఇజం సినిమాపై కల్యాణ్ రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విషయంలో సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కల్యాణ్ రామ్‌కు సహకరించినట్లు చెబుతున్నారు. బాబాయ్ బాలకృష్ణకు దూరమై వారసత్వ ఇమేజ్‌తో మాత్రమే కాకుండా సొంత బాణీతో ముందుకు వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సహకారం వల్ల కూడా ప్రస్తుత పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.

బాలయ్యకూ జూనియర్‌కూ మధ్య...

బాలయ్యకూ జూనియర్‌కూ మధ్య...

బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదని అంటున్నారు. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరికి తీయాలని ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది. కానీ ఆ దూరం మాత్రం తగ్గడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+