అలీ... ఏమిటి అలా ప్రకటించారు?

పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ అలీ గతంలోనే ప్రకటించారు.

ఏపీకి 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో 151 స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఎన్నికల్లో మొత్తం 175కు 175 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైనాట్ 175 పేరుతో ఎన్నికలకు వెళ్లబోతోంది. ఈ క్రమంలో భాగంగా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకు కొందరికి షాక్ తప్పదని వార్తలు వస్తున్నాయి. అధిష్టానం వారికి షాకిస్తే తమకు అవకాశం ఇవ్వకపోతుందా? అని ఎదురుచూసే నాయకుల సంఖ్య కూడా తక్కువేం కాదు.

అటువంటి నాయకుల్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి అలీ కూడా ఉన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆర్‌పీఎల్‌ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఏడు రాష్ట్రాల నుంచి టీమ్స్ ను తెప్పించి ఆర్పీఎల్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్పవిషయమంటూ నిర్వాహకులను కొనియాడారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో కొన్ని వందల సినిమాల షూటింగ్ లు జరిగాయని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడు ఎక్కడి నుంచి పోటీచేయమంటే అక్కడి నుంచి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

film acotr ali latest comments on upcoming elections

ఇటీవలే అలీని ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. ఎన్నికలకు ముందే వైసీపీ గెలుపు ఖాయమని అలీ 2019 ఎన్నికలకు ముందు జోస్యం చెప్పారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. ఏ నియోజకవర్గం నుంచైనా తాను పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. పవన్ కల్యాణ్ తనకు మంచి స్నేహితుడని, అయితే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని అలీ గతంలోనే అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధపడుతున్న అలీకి ముఖ్యమంత్రి జగన్ ఏ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారో చూడాలి మరి. ఎంపీగా పోటీచేయడానికి కూడా సిద్ధమేనంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+