చంద్రబాబు ప్రణాళికవల్లే: సుమన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై రజనీకాంత్ చేసిన ప్రసంగంలో తప్పేమీ లేదని ప్రముఖ నటుడు సుమన్ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన రజనీకాంత్ చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీ రాజకీయాల గురించి తమిళ నటుడికి ఏం తెలుస్తుందంటూ వైసీపీ నాయకులు రజనీని టార్గెట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో నటుడు సుమన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
రజినీకాంత్ తన ప్రసంగంలో ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదని.. అలాంటిది వైసీపీ నేతలు ఆయన్ను ఎందుకు విమర్శిస్తున్నారని సుమన్ ప్రశ్నించారు. హైదరాబాద్ కు కొత్త రూపం తీసుకొచ్చింది చంద్రబాబేనని, ప్రధాన రూపశిల్పి ఆయనేనన్నారు. శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ రంగం వంటివి వచ్చి.. ఇంతమంది ఉపాధి పొందుతున్నారంటే.. అవన్నీ చంద్రబాబునాయుడి ప్రణాళికలవల్లేనన్నారు. రాజకీయాల్లో ఒడుదొడుకులు, కొన్ని తప్పొప్పులు సర్వ సాధారణమని.. చంద్రబాబునాయుడు మంచి ముఖ్యమంత్రి అని సుమన్ ప్రశంసించారు.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు విజన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్ వెళ్లినప్పుడు న్యూయార్క్ లో ఉన్నామా? లేక హైదరాబాద్ లో ఉన్నామా? అనే భావన కలిగిందని చెప్పారు. రజనీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. హైదరాబాద్ అభివృద్ధిని సెలబ్రిటీలు సైతం మెచ్చుకుంటున్నారని, రజనీకాంత్ హైదరాబాద్ ను న్యాయార్క్ తో పోల్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు కృషి చేస్తోందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయస్థాయిలో పలు సమావేశాలను నిర్వహించడమే కాకుండా వివిధ ప్రాజెక్టులను తీసుకువచ్చామన్నారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications