EVMలు గాల్లోకి లేపనున్న దర్శకుడు వి.వి.వినాయక్?
ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ EVMలు గాల్లోకి లేపనున్నారు. ఎలాగంటారా.. వినాయక్ సినిమాలంటే గాల్లోకి సుమోలు లేవడం, భూమిలోనుంచి సుమోలు లేవడం సాధారణం. గొప్ప ఎలివేషన్స్ సీన్స్ తో సూపర్‌హిట్ సినిమాలు తీసిన వినాయక్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. గత ఎన్నికల్లోనే ఉభయ గోదావరి జిల్లాల్లోకి ఒక ఎంపీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేయాలని ప్రయత్నించారుకానీ ఎందుకో వెనక్కి తగ్గారు. ఈసారి తగ్గేదేలే! అంటున్నారు. తనదైన సినిమా స్టైల్‌లో EVMలు కూడా గాల్లోకి లేపుతారేమో చూద్దాం..!!

సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం
రాజకీయాలకు, చిత్రపరిశ్రమకు సహజమైన అవినాభావ సంబంధం ఉంటుంది. చిత్రపరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు రాగానే కొందరి చూపు రాజకీయాలపై పడుతుంది. ఇప్పటివరకు మనం అన్నీ సాధించేశాం.. ఇంకా సాధించాల్సింది ఏమన్నా ఉందా? అనే ఆలోచన వచ్చినప్పుడు విజయం సాధించిన వ్యక్తులు రాజకీయాలవైపు దృష్టిసారిస్తున్నారు. చిత్రపరిశ్రమద్వారా ప్రజల్లో వారికి వచ్చిన ఆదరణ ఎన్నికల్లో అదనపు ప్రయోజనంగా మారుతుంది. శాసనసభకో, లోక్‌సభకో అడుగుపెట్టాలనే ఆలోచనతో ఎంతోమంది సినీ ప్రముఖులు ఉంటున్నారు. గతంలో పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులైనవారున్నారు.. కేంద్ర మంత్రులైనవారున్నారు.. రాష్ట్ర మంత్రులైనవారున్నారు.

ఏ పార్టీ తరఫున పోటీచేస్తారో?
తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ రాజకీయల్లోకి అడుగుపెట్టబోతున్న ప్రచారం నడుస్తోంది. ఆయన సొంత జిల్లా నిజామాబాద్‌లో ఇప్పటికే ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభకు పోటీచేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ఇప్పుడు దర్శకుడు వినాయక్ వంతు వచ్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయనకు గతంలో వైసీపీ నాయకులతో మంచి సంబంధాలుండేవి. ఒకవేళ పోటీచేస్తే వైసీపీ తరఫున పోటీచేస్తారా? తెలుగుదేశం తరఫున పోటీచేస్తారా? జనసేన తరఫున పోటీచేస్తారా? అనేది తేలలేదు. ఆయనకు ఉన్న మిత్రులంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి కావచ్చు?
కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలు కూడా తగ్గించిన వినాయక్ తన దృష్టి మొత్తం రాజకీయాలపై కేంద్రీకరించబోతున్నట్లు సమాచారం. కాకపోతే ఏ పార్టీ అనేదే ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications