దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకడిగా.. రూ.వేల కోట్లకు అధిపతిగా!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మన్మథుడు అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు కింగ్ అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఆయన దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకడిగా ఉన్నారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగా, పలు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా రియల్ ఎస్టేట్ లో బాగా రాణిస్తున్నారు. పలురకాల వ్యాపారాలు ఆయన సొంతం. వాటిగురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుటుంది.
వేలకోట్ల రూపాయలకు అధిపతిగా మారిన నాగార్జునకు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి లభించిన ఆస్తితోపాటు తాను కూడా వ్యాపారాలు చేసి బాగా కూడబెట్టారు. వాస్తవానికి నాగార్జున ఇతర హీరోలతో పోలిస్తే పారితోషికం తక్కువే తీసుకుంటారు. ఒక్కో సినిమాకు ఆయన రెమ్యునరేషన్ రూ.10 కోట్ల లోపు ఉంటుంది. ప్రకటనలకు రూ.2 నుంచి రూ.3 కోట్లు తీసుకునేవారు. బిగ్ బాస్ షో చేసినందుకు రూ.20 కోట్లలోపు ఉంటుంది.

అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్, ఎన్ కన్వెన్షన్ సెంటర్. వీటిల్లో సినిమా ఓపెనింగ్‌లు, షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సీజీ వర్క్ జరుగుతుంటాయి. టీవీ షోల షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. అన్నపూర్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సినిమాలు నిర్మించడం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. స్టూడియోలో ఫిల్మ్ స్కూల్‌ని నడిపిస్తున్నారు. ఇందులో వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, స్టాండర్డ్స్ ని అందిస్తున్నారు. వీటి ద్వారా కోట్ల లాభాలు పొందుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టారు. పబ్స్, హోటల్స్ ఉన్నాయి.
నాగార్జునకి బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ 7 సిరీస్, బెంజ్, రేంజ్ రోవర్, స్పోర్ట్స్ కార్లున్నాయి. ఒక జెట్ ఫ్లైట్ కూడా ఉంది. హైదరాబాద్‌లో ఉన్న లగ్జరీ ఇళ్ల విలువ రూ.50 కోట్లు ఉంటుంది. వీటన్నింటి విలువ రూ.100 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. మొత్తంగా నాగార్జున ఆస్తులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. వారసత్వంగా వచ్చినవాటితోపాటు తాను సొంతంగా సంపాదించినవన్నీ కలుపుకుంటే వేలకోట్ల రూపాయలకు అధిపతిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications