షూటింగ్: హైదరాబాద్ పాతబస్తీ ప్రయాణికులపై 'కత్తి'
హైదరాబాద్: ఓ సినిమా షూటింగ్ హైదరాబాద్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. హైదరాబాదులోని పాతబస్తీలో గల చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌పై సినిమా షూటింగ్ జరుగుతుండడంతో ప్రయాణికులు నిత్యం తిప్పలు పడాల్సి వస్తోంది. సినిమా షూటింగ్ కోసం ఆ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను అనుమతించడం లేదు. షూటింగ్ జరుగుతున్న సినిమా పేరు కత్తి అని తెలుస్తోంది. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు, ఎపిఎస్‌పి పోలీసు ప్లాటూన్ ఫ్లైఓవర్‌ను మూసేశారు. రెండు వైపులా ఫ్లైఓవర్‌పైకి ట్రాఫిక్‌ను అనుమతించలేదు. శంషాబాద్, ఎల్బీ నగర్ మధ్య ప్రయాణించే వాహనాలను ఇరుగ్గా ఉండే రోడ్డుపై నుంచి మళ్లించారు.

ట్రాఫిక్‌ను మళ్లించిన తర్వాత తమిళ సినిమాకు సంబంధించిన యూనిట్ అక్కడికి వచ్చేసింది. ఎఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్, సమంత నటిస్తున్నారు. వారంతా ఉదయం 11 గంటలకు వచ్చేశారు. సమంత, విజయ్ జంటపై ఓ పాటను చిత్రీకరించారు. షూటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. ఆ తర్వాత తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది.
ఆ సినిమా షూటింగ్ కారణంగా ఫలక్‌నుమా - బార్కాస్ మధ్య, ఎల్బీ నగర్ - చాంద్రాయణగుట్ట మధ్య ప్రయాణికులు తీవ్రమైన ఇక్కట్లకు గురయ్యారు. ఈ సంఘటనపై వివరణ కోరడానికి ప్రయత్నిస్తే హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అందుబాటులో లేరని టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications