ర్యాంప్ షో: కెసిఆర్ తనయ, తారల సందడి (ఫొటోలు)

హైదరాబాద్: మహిళలపై అత్యాచారాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంఘటనలు విదేశీయులను కూడా దేశ పర్యటనకు దూరం చేస్తున్నాయి. దేశంలోని కొన్ని చోట్ల విదేశీ మహిళలపై జరిగిన లైంగిక దాడులు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోయే స్థితిని కల్పించాయి. ఈ స్థితిలో మహిళలను గౌరవించాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించటమే ధ్యేయంగా తస్య పేరిట మంగళవారం రాత్రి పార్క్ హయత్ హోటల్‌లో అవేర్‌నెస్ వాక్‌ను నిర్వహించారు.

సినీ తారలు వితిక, నిఖితా నారాయణ్, రీతు వర్మ, శ్రీముఖి, తేజస్విని, సిద్ధు, సూర్య, బాలాదిత్య, రజిత, ప్రగతి, సోషలైట్లు దీనాజ్, కవితా రెడ్డి, శ్రీదేవి చౌదరి, స్వాతి సంఘి, స్వాతి కిలారు, దీప్తి శ్రీ, హేమంత్ శ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాంప్‌వాక్ కూడా చేశారు.

నగర డిజైనర్ భార్గవి రూపొందించిన గౌన్లు, చీరలు ధరించి మోడల్స్ ర్యాంప్ షో చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ - ఐటి కారిడార్‌లో మహిళల భద్రతకు చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అసిస్టెంట్ కమిషనర్ అంజనికుమార్, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

కాజ్ ఫర్ వాక్ 1

కాజ్ ఫర్ వాక్ 1

మహిళలను గౌరవించాలనే సదుద్దేశంతో ఏర్పాటైన కాజ్ ఫర్ వాక్ కార్యక్రమంలో సినీ తారలతో పాటు కల్వకుంట్ల కవిత ఇలా..

కాజ్ ఫర్ వాక్ 2

కాజ్ ఫర్ వాక్ 2

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాజ్ ఫర్ వాక్ షోల్ సందడి చేశారు.

కాజ్ ఫర్ వాక్ 3

కాజ్ ఫర్ వాక్ 3

తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత చెప్పారు.

కవిత అభినందన

కవిత అభినందన

మహిళ భద్రత కోసం లఘు చిత్రాన్ని రూపొందించిన సైబరాబాద్ సిపి సివి ఆనంద్‌ను, తాన్య సంస్థ నిర్వాహకులను కవిత అభినందించారు.

కవిత ఇలా...

కవిత ఇలా...

భయాందోళనలు లేకుండా మహిళలు ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగగలుగుతారో అప్పుడే దేశం వెలుగుతుందని కవిత అన్నారు.

అందాల ఆరబోత

అందాల ఆరబోత

ఆధునిక, సంప్రదాయ దుస్తుల్లో సినీ తారలు, మోడల్స్ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ అందాలు ఆరబోశారు.

షోలో సినీ తారలు

షోలో సినీ తారలు

షోలో సినీ తారలు రీతూ వర్మ, నిఖిత నారాయణ్, శ్రీముఖి అందాలు ఆరబోస్తూ సందడి చేశారు.

వాక్ ఫర్ కాజ్..

వాక్ ఫర్ కాజ్..

వాక్ ఫర్ కాజ్ కార్యక్రమంలో మోడళ్లు, సినీతారలు ర్యాంప్ షోపై అందాలు ఆరబోశారు. సినీ తారలతో, నటులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాజ్ ఫర్ వాక్..

కాజ్ ఫర్ వాక్..

మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, ట్యాక్సీలూ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో రూపోందించిన లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు.

ర్యాంప్ షోలో నటులు..

ర్యాంప్ షోలో నటులు..

షోలో సినీ నటులు బాలాదిత్య, ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్, డిజె పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు ఇలా...

నటీనటులు ఇలా...

ర్యాంప్ షోలో సినీ నటులు ప్రగతి, రజిత, శుభ్ర, వితికా రావు సూర్య తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం ఈ షోను నిర్వహించారు.

డిజైనర్లు కూడా..

డిజైనర్లు కూడా..

ర్యాంప్ షోలో డిజైనర్లు భార్గవి, గౌరంగ్ షా కూడా పాల్గొన్నారు. కాజ్ ఫర్ వాక్ అనే పేరుతో సామాజిక ప్రయోజనం కోసం ఈ షోను నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+