జగన్ కేసు: తుది ఛార్జీషీట్‌లో సండూర్ పవర్, లేపాక్షి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) వేయనున్న తుది ఛార్జీషీటులో సండూర్ పవర్ అంశం ఉండనుందని తెలుస్తోంది. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికి ఎనిమిది ఛార్జీషీట్స్ దాఖలు చేసింది.
తుది ఛార్జీషీటును త్వరలో దాఖలు చేసే అవకాశముంది. అందులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోల్‌కతా బేస్డ్ సూటుకేసు కంపెనీలు, సండూరు పవర్ వంటి అంశాలు ఉండనన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో చివరి ఛార్జీషీటులో మంత్రి గీతా రెడ్డి పేరును ప్రస్తావించే అవకాశాలున్నాయంటున్నారు.

గీతా రెడ్డిని సాక్షిగా సిబిఐ ప్రస్తావించే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల దాఖలు సిమెంట్స్ అంశంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ సాక్షిగా ప్రస్తావించింది. తుది ఛార్జీషీటులో గీతా రెడ్డిని కూడా సాక్షిగానే పేర్కొనే అవకాశాలున్నాయని అంటున్నారు.
వారు ఈ ఛార్జీషీటును ఇవాళ రేపట్లో దాఖలు చేసే అవకాశాలున్నాయి. అదే సమయంలో జగన్ బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయనుంది. ఇటీవల జగన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తనకు బెయిల్ ఇవ్వాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కౌంటర్ దాఖలు చేసేందుకు సిబిఐ సమయం కోరింది.












Click it and Unblock the Notifications