• search
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యలమంచలి రవి:ఎట్టకేలకు...వైసిపిలో చేరిపోయాడు;వారథి ఊగిందా?

By Suvarnaraju
|
    యలమంచలిని ఆహ్వానించిన జగన్

    విజయవాడ:వైసిపి అధినేత జగన్ ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టడంతోనే విజయవాడ టిడిపి నేత యలమంచలి రవి ఆ పార్టీలో చేరిపోయారు.
    టిడిపికి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో ఈ పరిణామం వైసిపి శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

    జగన్ పాదయాత్ర కృష్ణా వారధి వద్దకు చేరుకోగానే అప్పటికే తన అనుచరులు,అభిమానులు,మద్దతుదారులతో అక్కడ వేచిచూస్తున్న యలమంచలి రవి తాను పార్టీలో చేరుతున్నట్లు చెప్పగానే వైకాపా అధినేత జగన్ తమ పార్టీ కండువా కప్పి వైసిపి లోకి ఆహ్వానించారు. యలమంచలి రవి చేరికతో విజయవాడలో వైసిపి బలపడుతుందని చెప్పారు. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో 13 నియోజకవర్గాల గుండా 270 కిలోమీటర్ల మేరా సాగనుంది.

    Finally Yalamanchali Ravi Joined in YCP

    మరోవైపు 136 రోజులుగా కొనసాగుతూ వస్తున్న జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా వైసిపి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ జనసందోహం అంతా జగన్ పాదయాత్రతో కలసి నడుస్తూ కృష్ణా వారధి దాటుతున్నతరుణంలో అందరూ ఒకేసారి వంతెన మీదుగా నడుస్తున్న క్రమంలో వారధి ఒక్కసారిగా ఊగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో జగన్ కూడా ఒక్క నిమిషం పాటు పాదయాత్ర నిలిపివేశారని అంటున్నారు. ఆ తరువాత పాదయాత్ర యధావిధిగా కొనసాగించారని, ఏదేమైనా పెను ముప్పు తప్పినట్లు అనిపించిందని ఈ పాదయాత్రలో పాల్గొన్న వైసిపి శ్రేణులు చెబుతున్నాయి.

    అంతకుముందు యలమంచలి రవి మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పొంతన లేని సమాధానాలు చెప్పటం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని విమర్శించారు. ఆ విధంగా తనను కూడా చంద్ర బాబు రెండు సార్లు మోసం చేశారని చెప్పారు. టీడీపీపై,చంద్రబాబుపై నమ్మకం పోయిన తానుకార్యకర్తలు, స్నేహితులతో చర్చించిన అనంతరం టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    విజయవాడ యుద్ధ క్షేత్రం
    సంవత్సరం
    అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
    2014
    కేసినేని శ్రీనివాస్ టీడీపీ విజేతలు 5,92,696 50% 74,862
    కోనేరు రాజేంద్ర ప్రసాద్ వైయస్సార్‌సీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,17,834 44% 0
    2009
    లగడపాటి రాజా గోపాల్ కాంగ్రెస్ విజేతలు 4,29,394 39% 12,712
    వంశీ మోహన్ వల్లభనేని టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,16,682 38% 0
    2004
    రాజగోపాల్ లగడపతి కాంగ్రెస్ విజేతలు 5,19,624 55% 1,14,587
    అశ్విని దత్ చలాసనీ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,05,037 43% 0
    1999
    గాడ్డే రామ మోహన్ టీడీపీ విజేతలు 4,82,968 52% 87,066
    ఉపేంద్ర పర్వతనేని కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,95,902 43% 0
    1998
    ఉపేంద్ర పర్వతనేని కాంగ్రెస్ విజేతలు 4,05,062 45% 30,067
    జై రమేష్ దాసరి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,74,995 42% 0
    1996
    ఉపేంద్ర పర్వతనేని కాంగ్రెస్ విజేతలు 3,97,709 45% 1,14,274
    వడ్డే శోభనద్రేస్వర నేతల టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,83,435 32% 0
    1991
    వడ్డే శోభంద్రేశ్వర రావు టీడీపీ విజేతలు 3,26,890 49% 36,221
    చెన్నూపతి విద్య ్ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,90,669 43% 0
    1989
    చెన్నూపతి విద్య కాంగ్రెస్ విజేతలు 4,23,867 53% 58,204
    వడ్డే శోభాధద్రిస్వరరావు టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,65,663 45% 0
    1984
    వడ్డే శోభనద్రేస్వర నేతల టీడీపీ విజేతలు 3,18,023 51% 28,444
    చెన్నూపతి విద్య కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,89,579 46% 0
    1980
    విద్యా చెన్నపతి ఐ ఎన్సి( ఐ ) విజేతలు 2,40,622 46% 98,702
    కె ఎల్ రావు జేఎన్ పి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,41,920 27% 0
    1977
    గోడి మురహరి కాంగ్రెస్ విజేతలు 2,39,733 53% 1,20,037
    గోతిపతి మురళి మోహన్ బిఎల్డి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,19,696 26% 0
    1971
    కె ఎల్ . రావు కాంగ్రెస్ విజేతలు 2,51,917 70% 1,56,004
    డి. నాగభూషణ రావు సీపీఐ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 95,913 27% 0
    1967
    కే.ఎల్ రావు కాంగ్రెస్ విజేతలు 0 0% -1,16,861
    1957
    కొమారాజు ఆచామంబ కాంగ్రెస్ విజేతలు 1,16,861 49% 2,088
    టామీనా పోతా రాజు సీపీఐ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,14,773 48% 0

    English summary
    Vijayawada:YSRCP chief YS Jagan Mohan Reddy's padayatra entered in Krishna district on its 136th day. YS Jagan will cover a distance of 270 kilometres and walk through 13 constituencies in the district. On this Occasion TDP Senior Leader Yalamanchili Ravi has joined in YSR Congress party.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more