టీడీపీ ఎంపీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: ప్రాణభయంతో పరుగులు..
ప్రమాదవశాత్తు భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో కార్మికులంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు.
చిత్తూరు: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు మండలం, పేటమిట్ట గ్రామం వద్ద ఉన్న అమర్ రాజా బ్యాటరీ విడిభాగాల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదవశాత్తు భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో కార్మికులంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. భారీగా ఎగసిపడ్డ మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న పాకాల అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications