విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో సిలిండర్ పేలుడు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలోని జగ్గారావు బ్రిడ్జి వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో షాపు షెటర్ ఎగిరి రోడ్డుపై వెళ్తున్న బస్సుపై పడింది. బస్సు అద్దాలు పగిలి పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. షాపులోని సామాగ్రి అంతా కాలిబూడిదయ్యింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్ జగ్గారావు బ్రిడ్జి వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లో చిన్నూరుకు చెందిన అహ్మద్ బాషా అనే వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఉదయం 9గంటలకు సిబ్బంది పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు తీవ్రతకు షాపు షెటర్ ఎగిరి రోడ్డుపై వెళ్తున్న బస్సుపై పడింది. దీంతో బస్సు అద్దాలు పగిలి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

పేలుడు శబ్ధానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. షాప్‌లో ఉన్న మరో రెండు సిలిండర్లను బయటకు తరలించారు. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ నుంచి వాణిజ్య వినియోగ సిలిండర్‌కు గ్యాస్‌ను ఎక్కిస్తుండగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. కొద్దిగా మంటలు వ్యాపించిన వెంటనే దుకాణంలో ఉన్న వారు షెటర్ కిందికి వేసి బయటికి పారిపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

సిలిండర్ పేలుడు

సిలిండర్ పేలుడు

విశాఖపట్నం నగరంలోని జగ్గారావు బ్రిడ్జి వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది.

సిలిండర్ పేలుడు

సిలిండర్ పేలుడు

దీంతో షాపు షెటర్ ఎగిరి రోడ్డుపై వెళ్తున్న బస్సుపై పడింది. బస్సు అద్దాలు పగిలి పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

సిలిండర్ పేలుడు

సిలిండర్ పేలుడు

షాపులోని సామాగ్రి అంతా కాలిబూడిదయ్యింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది.

సిలిండర్ పేలుడు

సిలిండర్ పేలుడు

పోలీసుల కథనం ప్రకారం.. అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్ జగ్గారావు బ్రిడ్జి వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లో చిన్నూరుకు చెందిన అహ్మద్ బాషా అనే వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు.

సిలిండర్ పేలుడు

సిలిండర్ పేలుడు

ఉదయం 9గంటలకు సిబ్బంది పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది.

సిలిండర్ పేలుడు

సిలిండర్ పేలుడు

పేలుడు తీవ్రతకు షాపు షెటర్ ఎగిరి రోడ్డుపై వెళ్తున్న బస్సుపై పడింది. దీంతో బస్సు అద్దాలు పగిలి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

English summary
Fire accident occurred at fast food centre in Visakhapatnam on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X