ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం - పవన్ పేషీ బ్లాక్ లో..!!

ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే సచివాలయం లోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను ఫైర్ సేఫ్టీ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదవశాత్తూ ఈ సంఘటన జరిగిందా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు

నిత్యం రద్దీగా ఉండే సచివాలయంలో ఈ ప్రమాదం జరగటం పైన ఉన్నతాధికారులు ఆరా తీస్తు న్నారు. కాగా, ఈ రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి.

fire-accident-in-ap-secretariat-second-block-spf-staff-controls-immediately

https://twitter.com/oneindiatelugu/status/1907991919382118481

తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం. బ్యాటరీల రూమ్ లో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+