తిరుపతమ్మ తిరునాళ్లలో అగ్నిప్రమాదం,తొక్కిసలాట:తప్పిన ప్రాణనష్టం
కృష్ణా జిల్లా : పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతర సందర్భంగా భక్తుల కోసం దేవస్థానం సమీపంలో వేసిన తాటాకు పందిళ్లలో వంట చేస్తుండగా...వాటి నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడి తాటాకు పందిళ్లు తగలబడటం ప్రారంభించినట్లు తెలిసింది.
ఆ తరువాత మంటలు మరింత విజృంభించడంతో భయభ్రాంతులకు గురైన భక్తులు తప్పించుకునేందుకు ఒక్కసారిగా అటూ ఇటూ పరుగులు దీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయినా ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి రాలేదని, మంటలను అదుపు చేయడానికి ఫైరింజన్లలో నీరు లేవని ఫైర్ సిబ్బంది చెప్పినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.

దీంతో స్థానికులే బిందెలతో నీళ్లు తెచ్చి మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పైగా తిరునాళ్ల ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే తొక్కిసలాట జరిగినా చాలా మందికి స్వల్పగాయాల మినహా ఎటువంటి ప్రాణనష్టం లేదని తెలిసింది. దీంతో ఈ విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications