• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫైర్ బ్రాండ్ రోజాలో మరో కోణం ... సిల్వర్ స్క్రీన్ నుండి స్పిరిట్యువల్ స్క్రీన్ దాకా రోజా ప్రస్థానం

|
  రాజకీయంగానే కాదు ఆధ్యాత్మిక కోణం లోను రోజా దిట్ట| Roja Career From Silver Screen To Spiritual Screen

  పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ రోజా... పాలిటిక్స్ లోనే కాదు సినీ ప్రపంచంలోను తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ రోజా. ఇక అంతేనా జబర్దస్త్ షో ల తో బుల్లితెర మీద కూడా ఒక వెలుగు వెలిగారు రోజా. అటు నటనలోనూ, ఇటు సేవ లోనూ, రాజకీయాల్లోనూ తన టాలెంట్ చూపిస్తున్న రోజాలో మనందరికీ తెలియని మరో కోణం కూడా దాగుంది. సిల్వర్ స్క్రీన్, పొలిటికల్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ లపై తన ముద్ర వేసుకున్న రోజా లోని కొత్త కోణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

  ఫైర్ బ్రాండ్ రోజాలో మరో కొత్త కోణం .. రాజకీయాలు, సేవ, నటనే కాకుండా ...

  ఫైర్ బ్రాండ్ రోజాలో మరో కొత్త కోణం .. రాజకీయాలు, సేవ, నటనే కాకుండా ...

  ఆర్ కే రోజా.. రాజకీయాల్లోకి వచ్చి పూర్తిస్థాయిలో సక్సెస్ అయిన మహిళలు, అందునా సినీ పరిశ్రమ నుండి వచ్చిన వారు చాలా తక్కువమంది అని చెప్పాలి. కానీ సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు రోజా. నగరి ఎమ్మెల్యే గా ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఫైర్ బ్రాండ్ రోజా. ఏపీ పారిశ్రామికాభివృద్ధిపై ఆమె ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇక ఏపీ పాలిటిక్స్ లోనూ అతి తక్కువ సమయంలో ప్రజాదరణ పొందిన నేతల్లో ఒకరుగా గుర్తింపబడిన రోజాలో ఆసక్తికర కోణం ఉంది.

  రోజాలో ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక కోణం ... తన ఆధ్యాత్మికత తెలిపేలా శ్రీ పూర్ణిమ గ్రంథం

  రోజాలో ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక కోణం ... తన ఆధ్యాత్మికత తెలిపేలా శ్రీ పూర్ణిమ గ్రంథం

  సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ, బుల్లితెర లోనూ ఇలా విభిన్న కోణాల్లో ప్రజలకు దగ్గరగా ఉంటూ అందరి మనసును గెలుచుకున్న రోజా ఇప్పుడు తనలోని సరికొత్త టాలెంట్ ను చూపిస్తూ, రోజాకు ఇంత తెలుసా అని అందరూ అవాక్కయ్యేలా చేయబోతున్నారని సమాచారం.

  సినిమాల్లో నాటీ బ్యూటీగా, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా, బుల్లి తెర మీద జబర్దస్త్ ఫేమ్ గా కనిపిస్తూ సందడి చేసే రోజా లో ఉన్న మరో అతి ముఖ్యమైన కోణం ఆధ్యాత్మిక కోణం . రోజాకు చాలా భక్తి భావం ఎక్కువట.. ఆధ్యాత్మిక, తాత్విక, ధార్మిక అంశాలపైన రోజా కు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుందని సమాచారం. దైనందిన కార్యక్రమాలలో ఎంత బిజీగా ఉన్నా రోజా మాత్రం చాలా ఎక్కువగా దైవ దర్శనాలు చేస్తూనే ఉంటారు. పూజలు, పునస్కారాల పేరుతో కూడా ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇక కార్తీక మాసం, శ్రావణ మాసం వచ్చిందంటే రోజా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం. కేవలం పూజలు, పునస్కారాల కే పరిమితం కాకుండా, ఆధ్యాత్మికత కోసం ఏదైనా చేయాలనే భావన ఉన్న రోజా తన భక్తిభావాన్ని చాతుకోవటం కోసం శ్రీ పూర్ణిమ గ్రంథాన్ని రచించారని సమాచారం.

  సీఎం జగన్ చేతులమీదుగా శ్రీ పూర్ణిమ గ్రంథ ఆవిష్కరణ కు ఏర్పాట్లు .. రోజా ఆధ్యాత్మిక కోణంపై ఆసక్తికర చర్చ

  సీఎం జగన్ చేతులమీదుగా శ్రీ పూర్ణిమ గ్రంథ ఆవిష్కరణ కు ఏర్పాట్లు .. రోజా ఆధ్యాత్మిక కోణంపై ఆసక్తికర చర్చ

  ఇక ఈ గ్రంథాన్ని వైయస్ జగన్ చేతులమీదుగా ఆవిష్కరింప చేయాలనేది రోజా కోరిక. శ్రావణమాసం రానున్న నేపథ్యంలో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించటం కోసం రోజా పనులు మొదలు పెట్టారని సమాచారం. పలు ధార్మిక విషయాలు, స్తోత్రాలు కలగలిపి రోజా సంకలనం చేసిన ఈ గ్రంథం పలు ఆధ్యాత్మిక అంశాలను ప్రజలకు తెలియ చేస్తుందట. భారత వైదిక వాఙ్మయంలో ని ప్రధాన అంశాలతో ఈ గ్రంథాన్ని తీసుకురావడంపై రోజా దృష్టి పెట్టి మరీ దీనిని సంకలనం చేస్తున్నారని సమాచారం . సినిమాల్లో తన అందచందాలతో ఆకట్టుకున్న రోజా తెలుసు, బుల్లి తెర మీద నవ్వుల పువ్వులు పూయించిన రోజా కూడా తెలుసు.. ఇక రాజకీయాల్లో ఫైర్ ఫ్రెండ్ ల మాటల తూటాలు పేల్చిన రోజా కూడా అందరికీ తెలుసు.. కాని ఆధ్యాత్మిక రోజా గురించి ఎవరికీ తెలియదని ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె రచించిన శ్రీ పూర్ణిమ గ్రంథ ఆవిష్కరణ కోసం అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP MLA RK Roja who is having many aspects to prove herself has also another unknown side of her. That hidden aspect of Nagari MLA has been revealed recently. Roja who is known for her association with films, politics and mesmerizing audience in a TV show, is also religious minded with spiritual thoughts. She has been coming before the audience with Sri Purnima Grantham which will be released from the hands of CM Jagan. It is well known that recently Roja took over the charge of APIIC chairperson at a program held in the APIIC head office in Mangalagiri town.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more