షార్ట్ సర్క్యూట్‌తో గాజువాకలో థియేటర్లు దగ్ధం, రూ.3 కోట్ల ఆస్తి నష్టం

విశాఖపట్నం: జిల్లాలోని గాజువాకలో థియేటర్లలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది మంటలను కాసేపట్లో అదుపులోకి తెచ్చింది. థియేటర్లోని మూడు స్క్రీన్లు కాలి బూడిదయ్యాయి. అది షో టైమ్ కాకపోవడంతో ప్రమాదం తప్పింది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్య, శ్రీకన్య థియేటర్లలో ప్రమాదం జరిగింది. ఈ రెండు థియేటర్లు కూడా ఒకేచోట పక్కపక్కనే ఉన్నాయి. థియేటర్‌లో ఊడ్చుతున్న వ్యక్తులు ప్రమాదాన్ని గుర్తించి చెప్పారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాదాపు రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది.

 Fire breaks out in Visakhapatnams Gajuwaka, 2 cinema theatres gutted, no casualties

గాజువాక మెయిన్ రోడ్డులో ఒకే భవనంలో కింది, పైఅంతస్తుల్లో కన్య, శ్రీకన్య థియేటర్లు ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున థియేటర్ల నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్వీపర్‌ చిట్టెమ్మ యజమానికి సమాచారం అందించింది. ఆయన ఫైరింజన్లకు సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చేసరికే థియేటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో రెండు థియేటర్లలోని తెరలు, సీట్లు, ప్రొజెక్టర్లు, ఏసీ యూనిట్లు పూర్తిగా కాలిపోయాయి. పోలీసుల, అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+