డ్రైవర్‌పై ఫైరింగ్, పోలీసులకు బెదిరింపు: సెక్స్ రాకెట్ రట్టు

డ్రైవర్ డబ్బులు ఇవ్వక పోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయనకు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో పోలీసులు షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారు రివాల్వర్‌తో బెదిరించి పరారయ్యారు. పోలీసులు నలుగురు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ట్రిపుల్ ఐటి విద్యార్థి మృతి
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి భవనం పైనుండి కిందపడి ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. విద్యార్థి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పాపళ్లవారిగూడెంకు చెందిన నవీన్‌గా తెలుస్తోంది. అతను ఈ4 ఫైనల్ చదువుతున్నారు. శుక్రవారం ఉదయం భనం పైన నుండి కిందపడ్డాడు. అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. హయత్ నగర్ మండలంలో పోలీసులు దీనిని రట్టు చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు. ముంబైకి చెంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు.












Click it and Unblock the Notifications