టాప్ 20 స్మార్ట్ సిటీల జాబితా నేడే, కొన్ని అంశాలు: అంచనాలో 'అమరావతి' సెకండ్

న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్న తొలి 20 నగరాలను గురువారం ప్రకటించనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం చెప్పారు. స్మార్ట్ సిటీల పోటీలో 97 నగరాలున్నాయని, వీటిలో తొలి స్థానంలో నిలిచిన 20 నగరాలను గురువారం వెల్లడిస్తామన్నారు.

పట్టణాభివృద్ధికి ఉన్న మార్గాలు, సవాళ్లపై వెంకయ్య మాట్లాడుతూ... పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలం పాటు అసమానతలు కొనసాగడం వల్ల జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం ఉంటుందని, అందువల్ల అమృత్, స్మార్ట్ సిటీలు, స్వచ్ఛ భారత్‌, ప్రధాన మంత్రి పట్టణ ఆవాస యోజన వంటి పథకాల ద్వారా అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పేదలను, అణగారిన వర్గాలను పణంగా పెట్టి పట్టణ ప్రాంతాల్లో జాగాలను సంపన్నులు అనుచిత రీతిలో ఉపయోగించుకోవడం పట్ల వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాల్లో అందరి భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కాగా, స్మార్ట్ సిటీల కింద అభివృద్ధి చేయబోయే మరో 40 నగరాలను రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రకటిస్తుంది.

దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రం ఒక్కో స్మార్ట్ సిటీని పొందే అవకాశముంది. పట్టణ జనాభా తదితరాలను పరిగణలోకి తీసుకొని స్మార్ట్ సిటీని ఎంపిక చేస్తారు.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ 13 స్మార్ట్ సిటీలను పొందనుంది. తమిళనాడు 12, మహారాష్ట్ర 10, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో 6 చొప్పున స్మార్ట్ సిటీలు ఎంపిక కానున్నాయి.

స్మార్ట్ సిటీగా ఎంపికైన నగరాలకు రానున్న అయిదేళ్లలో రూ.3 లక్షల కోట్లను కేటాయిస్తారు. వాటితో నగరాలను అభివృద్ధి చేస్తారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, వాతావరణం తదితరాలను నెలకొల్పుతారు. అర్బన్ ప్లానింగ్‌ను కిందిస్థాయి నుంచి ప్రారంభించవలసి ఉందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.

 First 20 'Smart Cities' To Be Announced Today

రాష్ట్రాల జాబితా

రాజస్థాన్ గత నెలలో (2015 డిసెంబర్) స్మార్ట్ లిస్ట్ జాబితాను పంపించింది. రాజస్థాన్ రూ.6,457 కోట్ల అంచనాను పేర్కొంది. అజ్మీర్, జైపూర్, కోటా, ఉదయ్‌పూర్‌లతో జాబితాను పంపింది. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్రలు కూడా జాబితాను పంపించాయి. నగరాల జాబితాతో పాటు అంచనా వ్యయాన్ని కూడా పంపించాయి.

మహారాష్ట్ర పది నగరాలను స్మార్ట్ సిటీ జాబితా కోసం పంపించింది. అందులో ముంబై కూడా ఉంది. వ్యయ అంచనాలో మాత్రం థానే మొదటి స్థానంలో ఉంది. థానే ఎస్టిమేషన్ రూ.6,630 కోట్లుగా ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రూ.5,305 కోట్లను అంచనా వేస్తూ జాబితా పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+